Site icon HashtagU Telugu

WI vs IND: మూడో మ్యాచ్ లో ఇషాన్ డౌటేనా ?

WI vs IND

New Web Story Copy 2023 08 08t152835.843

WI vs IND: విండీస్ గడ్డపై టీమిండియా వరుస పరాజయాలతో విమర్శలపాలవుతుంది. సుదీర్ఘ వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. టెస్ట్ మ్యాచ్ లో రాణించినప్పటికీ వన్డే మ్యాచ్ లో అతికష్టం మీద గెలిచి సిరీస్ గెలుచుకుంది. ప్రస్తుతం అయిదు టీ20 మ్యాచుల్లో మొదటి రేండు మ్యాచ్ లో పరాజయం పాలైంది. రెండు మ్యాచ్ ల్లోనూ బ్యాటర్లు దారుణంగా విఫలం చెందారు. మరీ ముఖ్యంగా ఓపెనర్లు చేతులెత్తేస్తున్నారు. ఇషాన్ కిషన్, గిల్ వాళ్ళ స్థాయికి దగ్గ ఆటను ఆడటం లేదు. దీంతో మూడో మ్యాచ్ కీలకంగా మారింది. మూడు మ్యాచ్ ల్లో టీమిండియా ఒక్క మ్యాచ్ ఓడినా సిరీస్ చేజారుతుంది. ఇక రెండు మ్యాచ్ లో విజయం సాధించిన కరేబియన్లు మూడో మ్యాచ్ లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు.

గయానా వేదికగా ఈ రోజు జరగనున్న చావోరేవో మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హార్దిక సారధ్యంలో టీమిండియా కాస్త తడబడుతుంది. బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తుంది. అయితే బ్యాటర్లు మాత్రం తేలిపోతున్నారు. పొట్టి ఫార్మెట్లో ఇషాన్ కిషన్ ఏ రేంజ్ లో బ్యాట్ ఝళిపిస్తాడో అందరికీ తెలుసు. దూకుడుగా ఆడుతూ ఒక దశలో అభిమానులకు పసందైన ఆటను పరిచయం చేస్తాడు. ఫోర్లు సిక్సర్లనే టార్గెట్ చేస్తుంటాడు. నిలకడగా ఆడకపోయినా ఎడాపెడా బాది జట్టుకు కావాల్సిన స్కోర్ చేసే పెవిలియన్ చేరుతాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏ మూలానా కనిపించడం లేదు. రెండంకెల స్కోర్ చేయడానికే కిందామీదా పడుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్‌ కోసం పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అతని స్థానంలో యువ బ్యాటర్‌, టెస్టుల్లో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్‌ తన తొలి టీ20 మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది.

మూడో మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ లో ఉండే ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌ లు ఉండే అవకాశం ఉంది.

Also Read: Chiranjeevi : ఈసారి అన్నయ్య వంతు.. వైసీపీ నేతలు దాడికి సిద్ధం