Site icon HashtagU Telugu

WI vs IND: ఇషాన్ హ్యటిక్ హాఫ్ సెంచరీ.. ధోనీ సరసన కిషన్

WI vs IND

New Web Story Copy 2023 08 02t174241.590

WI vs IND: ఈ మధ్య ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లను చూసి బాధపడాల్సి వస్తుంది. రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారనే కసి… రాక రాక వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మొన్న జరిగిన టెస్ట్ మ్యాచ్ లో విండీస్ బౌలర్లను ఓ ఆటాడేసుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ అన్న సోయి లేకుండా టీ20 తరహాలో బ్యాట్ ఝళిపించాడు. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ లోను అదే దూకుడు ప్రదర్శించి హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో ధోనీ పక్కన చేరిపోయాడు.

వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది భారత్. మూడో వన్డేలో టీమిండియా బ్యాటర్లు విధ్వంసమే సృష్టించారు. ఒకరిని మించి ఒకరు బ్యాట్ ఝళిపించడంతో 351 భారీ స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ ద్వారా ఇషాన్ ఖాతాలో అరుదైన రికార్డ్ నమోదైంది. తొలి వన్డేలో 52 పరుగులు, రెండో వన్డేలో 55 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. మూడో వన్డేలో 77 పరుగులు చేశాడు. ఫలితంగా వరుసగా మూడు వన్డేల్లో అర్ద సెంచరీలు చేసిన రెండో భారత వికెట్ కీపర్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు ధోని మాత్రమే ఈ ఘనతను సాధించాడు. ధోని 2019లో ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ అందుకున్నాడు.

Also Read: Sunflower Sarming: 50వ పెళ్లిరోజు కానుకగా 12 లక్షల ప్రొద్దుతిరుగుడు పువ్వులను బహుమతిగా ఇచ్చిన భర్త ?