Site icon HashtagU Telugu

Agarkar- Gambhir: అగార్కర్- గంభీర్ మధ్య రిలేషన్ స‌రిగ్గా లేదా? ఆ ప్లేయ‌ర్ విష‌యంలో వివాదం?

Gambhir- Agarkar

Gambhir- Agarkar

Ajit Agarkar- Gautam Gambhir: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఇందులో చివరి అంటే 5వ మ్యాచ్ జనవరి 3 నుండి సిడ్నీలో జరుగుతుంది. అయితే అంతకుముందే ఓ వార్త బయటకు వ‌చ్చింది. నిజానికి టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సెలక్టర్ అగార్క‌ర్‌ (Ajit Agarkar- Gautam Gambhir) మధ్య సంబంధాలు సరిగా లేవని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పుజారాకు సంబంధించిన విష‌యంలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య వివాదం కూడా వ‌చ్చినట్లు స‌మాచారం.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం టీమ్ ఇండియాలో ఛతేశ్వర్ పుజారాను చేర్చుకోవాలని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోరాడు. కానీ బీసీసీఐ సెలక్టర్లు గంభీర్ మాట వినలేదు. పుజారాను జ‌ట్టులో భాగం చేయ‌లేదు. పెర్త్ టెస్టు తర్వాత పుజారాను టీమ్ ఇండియాలో చేర్చుకోవడంపై గంభీర్ మాట్లాడినట్లు నివేదికలో పేర్కొన్నారు.

పుజారా ఆడకపోవడంతో ఆస్ట్రేలియా బౌలర్ సంతోషం?

ఛెతేశ్వర్ పుజారా గైర్హాజరీలో పుజారాను జట్టులోకి తీసుకోనందుకు ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పుజారా ఇక్కడ లేకపోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. జ‌ట్టు క‌ష్ట స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు పుజారా ఎన్నో స్లారు నిల‌క‌డ‌గా రాణించాడు. అంతేకాకుండా అత‌ను గ‌త‌ ఆస్ట్రేలియా టూర్‌లో చాలా మంచి ప్రదర్శన చేశాడు.

Also Read: Usman Khawaja Retire: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్ రిటైర్మెంట్?

పుజారా 100 టెస్టులు ఆడాడు

ఛతేశ్వర్ పుజారా టీమిండియా తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను చివరిసారిగా 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా తరపున ఆడాడు. పుజారా ఎల్లప్పుడూ ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన ఇచ్చాడు. పుజారా 2018-19 సంవత్సరం బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో 1258 బంతులు ఆడి 521 పరుగులు చేశాడు. 2020-21లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ముందంజ‌లో ఉంది. సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో ఆసీస్ జ‌ట్టు 184 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. అంతేకాకుండా వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు రెండో పోటీదారుగా నిలిచింది. జ‌న‌వ‌రి 3 నుంచి జ‌రిగి సిడ్నీ టెస్టులో టీమిండియా గెల‌వ‌కుంటే సిరీస్ ఆసీస్ కైవసం అవుతుంది.