మొహమ్మద్ షమీ కెరీర్ ముగిసిన‌ట్లేనా?!

ప్రస్తుతం షమీ బెంగాల్ జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నారు. ఈ 50 ఓవర్ల టోర్నమెంట్‌లో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు తీశారు.

Published By: HashtagU Telugu Desk
Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ మరోసారి నిరాశకు గురయ్యారు. జనవరి 11 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం జట్టును ప్రకటించింది. 2026లో జరగబోయే ఈ మొదటి సిరీస్‌లో షమీకి అవకాశం దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ షమీని పక్కన పెట్టడం చూస్తుంటే భారత క్రికెట్ బోర్డు ఆయన కంటే ముందున్న యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతోందని స్పష్టమవుతోంది. ఇది షమీ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికే సంకేతమా? అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: వెనిజులాలో అర్ధరాత్రి వైమానిక దాడులు… అసలు మదురోపై ట్రంప్ ఎందుకు పగబట్టారు?

భావోద్వేగానికి లోనైన అభిమానులు

టీమ్ ఇండియా స్క్వాడ్‌లో షమీ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ షమీ ఫోటోను షేర్ చేస్తూ.. “నేటి జట్టు ఎంపికను చూస్తుంటే మొహమ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ బహుశా ఇక్కడితో ముగిసినట్లే కనిపిస్తోంది” అని రాసుకొచ్చారు. ఈ వెటరన్ పేసర్‌కు దక్కిన అవమానంపై ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు.

భారత్ తరపున షమీ ఆడిన చివరి మ్యాచ్?

షమీ టీమ్ ఇండియా తరపున తన చివరి మ్యాచ్‌ను 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రూపంలో ఆడారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ టోర్నమెంట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో షమీ ఒకరు. ఆ టోర్నమెంట్‌లో ఆయన మొత్తం 9 వికెట్లు పడగొట్టారు.

దేశవాళీ క్రికెట్‌లో అప్రతిహత ప్రస్థానం

ప్రస్తుతం షమీ బెంగాల్ జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నారు. ఈ 50 ఓవర్ల టోర్నమెంట్‌లో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు తీశారు. అంతకుముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. అంతకుముందు రంజీ ట్రోఫీలోనూ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశారు. ఇంతటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ జట్టులో చోటు దక్కకపోవడం ఆయన అంతర్జాతీయ కెరీర్ ముగింపునకు సంకేతంగా కనిపిస్తోంది.

  Last Updated: 03 Jan 2026, 09:52 PM IST