Virat Kohli: మిగిలిన మూడు టెస్టుల‌కి విరాట్ కోహ్లీ క‌ష్ట‌మేనా..?

ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) దూరంగా ఉండవచ్చని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి.

  • Written By:
  • Updated On - February 1, 2024 / 09:42 AM IST

Virat Kohli: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటి వరకు టీమిండియాను ప్రకటించింది. ఇప్పుడు త్వరలో సెలెక్టర్లు మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించవచ్చు. ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) దూరంగా ఉండవచ్చని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి.

తొలి టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ గాయపడడం గమనార్హం. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పుడు మిగిలిన మూడు టెస్టుల నుంచి కూడా రవీంద్ర జడేజా తప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కేఎల్ రాహుల్ పునరాగమనం సాధ్యమేన‌ని తెలుస్తోంది.

చెతేశ్వర్ పుజారా తిరిగి రావచ్చు

స్వదేశంలో సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని అతను చివరి మూడు టెస్టులకు టీమ్ ఇండియాకు తిరిగి రావచ్చు. పూజారా తిరిగి రావడానికి రెండవ అతిపెద్ద కారణం ఏమిటంటే..గిల్ మూడవ స్థానంలో ఫ్లాప్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మూడో నంబర్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల బ్యాట్స్‌మెన్ భారత జట్టుకు అవసరం. ఈ పాత్రలో పుజారా సరిగ్గా సరిపోతాడని సెలెక్ట‌ర్లు భావిస్తున్నారు.

Also Read: King of Malaysia: మలేషియా 17వ రాజుగా సుల్తాన్‌.. ఆయన ఆస్తులెంతో తెలుసా..?

ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు (అంచ‌నా)- రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

We’re now on WhatsApp : Click to Join

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్

1వ టెస్టు: భారత్ v ఇంగ్లాండ్, జనవరి 25-29, హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం)
2వ టెస్టు: భారత్ vs ఇంగ్లండ్, ఫిబ్రవరి 2-6, విశాఖపట్నం (డాక్టర్ వైఎస్ రాజశేఖర్ క్రికెట్ స్టేడియం)
3వ టెస్ట్: ఇండియా vs ఇంగ్లండ్, ఫిబ్రవరి 15-19, రాజ్‌కోట్ (సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం)
4వ టెస్టు: భారత్ vs ఇంగ్లండ్, ఫిబ్రవరి 23-27, రాంచీ (JSCA ఇంటర్నేషనల్ స్టేడియం)
ఐదవ టెస్ట్: భారత్ vs ఇంగ్లాండ్, మార్చి 7-11, ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం)

Follow us