Site icon HashtagU Telugu

Irfan Pathan: ఆఫ్గాన్ జట్టుతో ఇర్ఫాన్ పఠాన్ సక్సెస్ సెలబ్రేషన్స్.. వీడియో చూశారా

Irfan Pathan

Irfan Pathan

Irfan Pathan: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ జట్టు సంచలన విజయం నమోదు చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇది కదా సక్సెస్ అంటూ ప్రతిఒక్కరూ  ఆ జట్టును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్  స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ప్రపంచ కప్‌లో రెండో ఆశ్చర్యకరమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. సోమవారం 50 ఓవర్ల క్రికెట్‌లో పాకిస్తాన్‌పై మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది.

దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సభ్యులు ఓ రేంజ్ లో స్టేడియంలో ఎగురుతూ సక్సెస్ ను సెలబ్రేట్ చసుకున్నారు. కామెంటరీతో నిమగ్నమై ఉన్న ఇర్ఫాన్‌ను రషీద్ గుర్తించాడు. ఇద్దరు క్రికెటర్లు ఒకరినొకరు అభినందించుకుంటూ ఆలింగనం పంచుకున్నారు. ఆ తర్వాత డాన్స్ చేసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.