Irfan Pathan : ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం అవుతున్న వేళ షాకింగ్ న్యూస్. ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను బీసీసీఐ పక్కన పెట్టినట్లు సమాచారం. ఈమేరకు ఐపీఎల్ కమిటీ ఆయనపై వేటు వేసినట్లు తెలిసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండగా కామెంట్రీ చేసే సమయంలో, ఇర్ఫాన్ పఠాన్ కావాలనే కొందరు ఆటగాళ్లపై వ్యాఖ్యలు చేస్తున్నట్లు బీసీసీఐకి ఫిర్యాదులు అందాయి. ఆస్ట్రేలియాలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్ జరిగిన సమయంలో కొందరు ఆటగాళ్లపై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ చేశారు. అవి నచ్చకపోవడంతో ఓ ఆటగాడు పఠాన్ నంబరును తన ఫోన్‌లో బ్లాక్ చేశాడట. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌పై బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు నుంచి జరగనున్న ఐపీఎల్ 18వ సీజన్ మ్యాచ్‌ల కోసం అధికారిక కామెంట్రీ ప్యానెల్ జాబితాను బీసీసీఐ శుక్రవారమే విడుదల చేసింది. ఇందులో ఇర్ఫాన్ పఠాన్ పేరు లేదు.
Mic on, filter off. #SeedhiBaat with #IrfanPathan – jahan baatein hoti hain asli.
Link yahi hai boss: https://t.co/NQixk8f3aN pic.twitter.com/xiOg3Ymyuv— Irfan Pathan (@IrfanPathan) March 22, 2025
Also Read :Jnanpith Award : వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్.. ఆయన నేపథ్యమిదీ
ఇర్ఫాన్ పఠాన్ సొంత యూట్యూబ్ ఛానల్
ఇక ఐపీఎల్(Irfan Pathan) కామెంట్రీ ప్యానెల్ నుంచి తనను తొలగించిన వెంటనే ఇర్ఫాన్ పఠాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంత యూట్యూబ్ ఛానల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘‘మైక్ ఆన్.. ఫిల్టర్ ఆఫ్. ఇర్ఫాన్‌తో నేరుగా మాట్లాడుదాం. వాస్తవాలే మాట్లాడుకుందాం’’ అని పేర్కొంటూ ఇర్ఫాన్ పోస్ట్ పెట్టడం గమనార్హం.
Also Read :PVR Inox : బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో బిగ్ డీల్
సంజయ్ మంజ్రేకర్, హర్ష భోగ్లేపైనా ఇలాగే..
గతంలో సంజయ్ మంజ్రేకర్, హర్ష భోగ్లే వంటి వారిపైనా బీసీసీఐ ఇదే తరహాలో చర్యలు తీసుకుంది. 2019లో టీమ్‌ఇండియా ఆటగాళ్లపై మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో తోటి క్రికెట్ కామెంటేటర్ భోగ్లేతోనూ ఆయన వివాదానికి దిగారు. ఈ పరిణామల తర్వాత 2020లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కామెంట్రీ ప్యానెల్ నుంచి మంజ్రేకర్‌ను బీసీసీఐ తప్పించింది. 2016 ఐపీఎల్ సీజన్‌కు ముందు భోగ్లేపైనా ఇలాంటి పరిస్థితుల్లోనే వేటు పడింది.