IND vs PAK: పాక్ బ్యాట‌ర్ల‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌.. అంత సీన్ లేదంటూ..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఈనెల 23వ తేదీన భార‌త్‌- పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న పాక్ ఓపెన‌ర్లు రిజ్వాన్‌, బాబార్ ఆజ‌మ్‌ల‌ను ఎలా పేస్ చేయాలో టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ స‌ల‌హా ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 11:31 PM IST

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఈనెల 23వ తేదీన భార‌త్‌- పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న పాక్ ఓపెన‌ర్లు రిజ్వాన్‌, బాబార్ ఆజ‌మ్‌ల‌ను ఎలా పేస్ చేయాలో టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ స‌ల‌హా ఇచ్చాడు. పాక్ ఓపెన‌ర్ల గురించి మాట్లాడుతూ.. వీళ్లిద్ద‌రూ చాలా కీల‌కం. రిజ్వాన్‌కు ఫుల్ లెన్త్‌, బాబ‌ర్‌ను ఎల్‌బీడ‌బ్ల్యూ ఔట్ చేసేలా బంతులేస్తే వారిని క‌ట్ట‌డి చేయొచ్చు. పాక్ బ్యాట‌ర్లు స్పిన్‌ను ధీటుగా ఎదుర్కొనేంత బ్యాట‌ర్లు ఏం కాదు అని ప‌ఠాన్ అన్నాడు.

ఐసీసీ టీ20 పురుషుల టీ20 ప్రపంచ కప్ ఈనెల‌ 16న గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లతో ప్రారంభంకానుంది. సూపర్-12 రౌండ్ అక్టోబర్ 22న ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్‌ నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుతో ఆడ‌నుంది.

పాకిస్తాన్ ఓపెనింగ్ ద్వయం మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజ‌మ్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట‌ర్ల‌గా పేరొందారు. ఈ స్టార్ బ్యాటర్‌లు ఇద్దరూ తమ జట్టు కోసం స్థిరంగా మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. ICC పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్‌ 2022లో 18 టీ20 మ్యాచ్‌ల‌లో 54.73 సగటుతో, 126.30 స్ట్రైక్ రేట్‌తో 9 అర్ధ సెంచరీలతో సహా 821 పరుగులు చేశాడు. ICC పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ 3 స్థానంలో బాబర్ అజామ్ ఉన్నాడు. 2022లో 19 టీ20 గేమ్‌లలో 38.18 సగటుతో, 131.96 స్ట్రైక్ రేట్‌తో 611 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.