MI vs KKR: నిన్న మ్యాచ్ లో హార్దిక్ భారీ తప్పిదం.. ఇర్ఫాన్ పఠాన్ ఫైర్

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. హార్దిక్ పాండ్యాపై హాట్ కామెంట్స్ చేశాడు. కేకేఆర్.. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సందర్భంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు ముంబై కొంప ముంచాయని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అప్పటికే ఐదు వికెట్లు పడ్డ దశలో నమన్ ధీర్‌కు మూడు ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

MI vs KKR: వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ని కోల్‌కతా నైట్ రైడర్స్ దారుణంగా ఓడించింది. ఈ పిచ్ పై దాదాపు 12 ఏళ్ళ తర్వాత కోల్కతా ముంబైపై విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఇచ్చిన 170 టార్గెట్ ను చేదించే క్రమంలో ముంబై 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ మినహా మారే బ్యాటర్ కూడా రాణించకపోవడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది.

ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్ ఆశల్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. నిజానికి నిన్నటి మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాటర్లు విఫలమయ్యారు. వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా 70 పరుగులతో రాణించడంతో కేకేఆర్ 169 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబయి ఇండియన్స్‌ బరిలోకి దిగగా ఆ జట్టుకు పేలవమైన ఆరంభం లభించింది. దీంతో ఆ జట్టు 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 11 పరుగులు, ఇషాన్ కిషన్ 13, నమన్ ధీర్ 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే నిలదొక్కుకున్నాడు, కానీ అవతలి ఎండ్ నుండి వికెట్లు నేలకూలడంతో అన్నిదార్లు మూసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు.ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. మిడిల్ ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్లు దూకుడుగా బ్యాటింగ్ చేయకుండా అడ్డుకున్నారు. చివరి ఓవర్లో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టాడు.

We’re now on WhatsAppClick to Join

వాస్తవానికి, ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ ఆండ్రీ రస్సెల్, రస్సెల్ అప్పటికే నిలదొక్కుకున్న సూర్యకుమార్ యాదవ్ను అవుట చేసి ముంబైని కట్టడి చేశాడు. ఇక ఈ మ్యాచులో ఓటమి పాలైన ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 8 పరాజయలు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ ప్లేసులో ఉన్న ముంబై.. మిగిలి మూడు మ్యాచుల్లోనూ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ప్లేఆఫ్ కోసం ప్రత్య్ జట్టు 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. హార్దిక్ పాండ్యాపై హాట్ కామెంట్స్ చేశాడు. కేకేఆర్.. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సందర్భంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు ముంబై కొంప ముంచాయని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అప్పటికే ఐదు వికెట్లు పడ్డ దశలో నమన్ ధీర్‌కు మూడు ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరొక్క వికెట్ అప్పుడే పడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని.. నువాన్ తుషారా, బుమ్రా, గెరాల్డ్ కొయెట్జీ వంటి బౌలర్లు వికెట్ తీసే వారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Also Read: YS Sharmila : తొమ్మిది ప్రశ్నలతో జగన్ కు షర్మిల మరో బహిరంగ లేఖ