Irfan Pathan Wife : తొలిసారి భార్య ఫొటోను షేర్ చేసిన ఇర్ఫాన్.. సఫా బేగ్ ఎవరు ?

Irfan Pathan Wife : భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పెళ్లయి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి.

Published By: HashtagU Telugu Desk
Irfan Pathan Wife

Irfan Pathan Wife

Irfan Pathan Wife : భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పెళ్లయి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. గత శనివారం అతడి 8వ వివాహ వార్షికోత్సవం జరిగింది. ఇప్పటివరకు ఎన్నడు కూడా తన భార్య మొహం చూపించే ఫొటోను ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. కానీ తొలిసారిగా ఆయన శనివారం తన భార్య సఫా బేగ్ ఫొటోను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో వైరల్ గా మారింది. ఇర్ఫాన్, సఫా దంపతుల అందమైన జోడీపై నెటిజన్స్ పాజిటివ్‌గా చాలా కామెంట్స్ చేశారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిద్దరికి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన భార్య ఫొటోను పోస్ట్ చేస్తూ మనసును హత్తుకునే కొంత టెక్ట్స్ కూడా ఇర్ఫాన్ పఠాన్ చక్కగా రాసుకొచ్చారు. అదేమిటంటే.. ‘‘ చాలా పాత్రలను ఆమె ఒక్కరే పోషిస్తున్నారు. నాకు మూడ్ బూస్టర్‌గా, హాస్యనటిగా, సహచరిగా, స్నేహితురాలిగా.. నా పిల్లలకు తల్లిగా ఆమె పోషిస్తున్న పాత్రలెన్నో ఉన్నాయి. ఈ అందమైన ప్రయాణంలో  నేను నిన్ను నా భార్యగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమకు 8వ శుభాకాంక్షలు’’ అని పఠాన్(Irfan Pathan Wife) తన ట్విట్టర్ పోస్టులో రాశారు.

We’re now on WhatsApp. Click to Join

సఫా బేగ్ ఎవరు ?

  • సఫా బేగ్ 1994  ఫిబ్రవరి 28న సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న అజీజ్యా జిల్లాలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. సఫా తండ్రి సౌదీలో ప్రముఖ వ్యాపారవేత్త. దీని కారణంగా సఫా, ఆమె ముగ్గురు సోదరీమణులు విలాసవంతమైన జీవనశైలిని గడిపారు.
  • జెద్దాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను సఫా అభ్యసించింది.
  • తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత సఫా మోడలింగ్‌పై ఆసక్తిని పెంచుకుంది.
  • సనాతన ముస్లిం కుటుంబంలో పెరిగినప్పటికీ.. ఆమె తల్లిదండ్రులు కెరీర్ ఎంపికలలో తమ కుమార్తెకు మద్దతు ఇచ్చారు. దీంతో మోడలింగ్ కెరీర్‌‌ను సఫా ప్రారంభించారు.
  • సఫాకు నెయిల్ ఆర్ట్‌పై ఆసక్తి ఎక్కువ.
  • ఇర్ఫాన్ పఠాన్‌, సఫా బేగ్  తొలిసారిగా 2014లో కలుసుకున్నారు. సఫా బేగ్ కంటే ఇర్ఫాన్ పఠాన్ వయసులో పదేళ్లు పెద్దవాడు.
  • దాదాపు రెండు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేశారు. ఆ తరువాత ఇర్ఫాన్ తన లవర్ సఫాను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. గుజరాత్‌లోని వడోదరకు ఆహ్వానించాడు.
  • ఇర్ఫాన్ పఠాన్,  సఫా బేగ్ 2016 ఫిబ్రవరి 4న మక్కాలో పెళ్లి చేసుకున్నారు.  జెడ్డాలో వివాహ విందు కార్యక్రమం జరిగింది.

Also Read :Wedding Fraud : వరుడు ఫేక్.. వధువు ఫేక్.. బోగస్ పెళ్లిళ్ల స్కాం కలకలం

  Last Updated: 04 Feb 2024, 12:27 PM IST