Site icon HashtagU Telugu

West Indies out of the T20 WC: టీ20 ప్రపంచకప్‌ నుంచి వెస్టిండీస్‌ ఔట్..!

19d1d133 Wi Vs Ire Ls

19d1d133 Wi Vs Ire Ls

టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫైయర్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై ఐర్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘాన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు కేవలం ఒక వికెట్ కోల్పోయి 17. ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి సూపర్-12కు అర్హత సాధించింది. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ చాంపియన్స్ గా నిలిచిన వెస్టిండీస్ ఈ WCలో అర్హత కూడా సాధించకపోవడం గమనార్హం.

ఆస్ట్రేలియా వేదికగా ఈ టీ20 ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సూపర్- 12 మొదలవడానికి ముందు గ్రూప్ మ్యాచ్ లు జరిగాయి. అక్టోబర్ 17న స్కాట్లాండ్ జట్టు చేతిలో 42 పరుగుల తేడాతో విండీస్ ఓడిపోయింది. అక్టోబర్ 19న జింబాబ్వేపై గెలిచింది. ఇక తాజాగా జరిగిన మ్యాచులో ఐర్లాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో కనీసం గ్రూప్ స్టేజ్ దాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.