Site icon HashtagU Telugu

Irani Cup:రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్

Champpions

Champpions

దేశవాళీ క్రికెట్ టోర్నీ ఇరానీ కప్ ను రెస్టాఫ్ ఇండియా కైవసం చేసుకుంది. తొలిరోజు నుంచే పూర్తి ఆధిపత్యం కనబరిచిన రెస్టాఫ్ ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్ర నిర్ధేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ హాఫ్‌ సెంచరీతో రాణించగా…. కోన శ్రీకర్‌ భరత్‌ 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలింది. తర్వాత రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్‌ అయింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీతో అదరగొడితే.. తెలుగుతేజం హనుమ విహారి 82, సౌరబ్‌ కుమార్‌ 55 పరుగులు చేశారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర పోరాడింది. కెప్టెన్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ ప్రేరక్‌ మాన్కడ్ రాణించారు. ఉనాద్కట్ 89, మాన్కడ్ 72 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 8 వికెట్లతో సౌరాష్ట్ర బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు ఇది 29వ ఇరానీ టైటిల్‌.