Site icon HashtagU Telugu

IPL Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ బిగ్ అప్డేట్‌!

WTC Final Host

WTC Final Host

IPL Suspended: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక పెద్ద ప్రకటన చేస్తూ ఐపీఎల్ 2025 (IPL Suspended)ని ఒక వారం పాటు నిలిపివేస్తున్న‌ట్లు తెలిపింది. షెడ్యూల్‌లో మార్పులు, మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ గురించిన సమాచారం పరిస్థితులను అంచనా వేసిన తర్వాత అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు పేర్కొంది. అన్ని ఫ్రాంచైజీలు, భాగస్వాములతో మాట్లాడిన తర్వాతే టోర్నమెంట్‌ను ఆపివేయాలనే నిర్ణయం తీసుకున్న‌ట్లు బీసీసీఐ పేర్కొంది.

పాకిస్తాన్ దాడి తర్వాత బీసీసీఐ IPL 2025 మిగిలిన మ్యాచ్‌లను సస్పెండ్ చేసింది. అయితే IPL 2025 మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఒక వారం తర్వాత దీనిపై పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని బీసీసీఐ కంటే ముందు కొన్ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. IPL గవర్నింగ్ కౌన్సిల్ స్వయంగా ఈ సమాచారం ఇచ్చింది. ఈ టోర్నమెంట్ కేవలం ఒక వారం పాటు సస్పెండ్ చేసిన‌ట్లు.. 7 రోజుల తర్వాత మళ్లీ పరిస్థితులను సమీక్షించి, ఆ తర్వాత IPLపై తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు పేర్కొన్నారు.

Also Read: IPL 2025 Suspended: ఐపీఎల్ నిర‌వ‌ధిక వాయిదా.. రీషెడ్యూల్ ఎప్పుడో తెలుసా?

BCCI తీసుకున్న పెద్ద నిర్ణయం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెలిపిన వివరాల ప్రకారం.. IPL కొత్త షెడ్యూల్ వచ్చే వారం విడుదల కావచ్చు. BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సమాచారం ఇస్తూ ప్రస్తుతం IPL పూర్తిగా సస్పెండ్ కాలేదని, దానిని కేవలం ఒక వారం పాటు ఆపివేశామని తెలిపారు. పరిస్థితుల సమీక్ష తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామ‌న్నారు.

IPL ప్రకటన

ఒక వారం పాటు IPL సస్పెండ్ అవ్వడంపై IPL గవర్నింగ్ కౌన్సిల్ ఇలా పేర్కొంది. ‘ఈ విషయంలో IPL గవర్నింగ్ కౌన్సిల్ ఒక ఈమెయిల్ జారీ చేసింది. అందులో ఇలా పేర్కొనబడింది. ఈ నిర్ణయం IPL గవర్నింగ్ కౌన్సిల్ అన్ని జట్ల నుండి సముచిత సలహాల తర్వాత తీసుకుంది. ఈ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల ఆందోళనలు, భావోద్వేగాలతో పాటు ప్రసారకర్తలు, స్పాన్సర్లు, అభిమానుల ఆలోచనలను కూడా పంచుకున్నాయి. BCCIకి మన సాయుధ బలగాల బలం, సన్నాహాలపై పూర్తి విశ్వాసం ఉంది. కానీ బోర్డు ఈ నిర్ణయాన్ని అన్ని వాటాదారుల సమిష్టి హితం కోసం తీసుకోవడం సరైనదిగా భావించింది’ అని పేర్కొంది.