KKR vs RCB Match: RCB రివేంజ్ తీర్చుకుంటుందా..? నేడు ఐపీఎల్‌లో ఆర్సీబీ వ‌ర్సెస్ కేకేఆర్‌

ఐపీఎల్ 2024 36వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

  • Written By:
  • Publish Date - April 21, 2024 / 12:30 PM IST

KKR vs RCB Match: ఐపీఎల్ 2024 36వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB Match)తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. RCBకి ఈ మ్యాచ్ డూ ఆర్ డై కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి త‌ప్పుకుంటుంది. కాబట్టి ఫాఫ్ డు ప్లెసిస్ జ‌ట్టు ఎలాగైనా విజయం నమోదు చేయడానికి ప్రయత్నించాలి. మరోవైపు చివరి మ్యాచ్‌లో ఓడి వస్తున్న కోల్‌కతా మళ్లీ గెలుపు ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

రాణా జ‌ట్టులోకి తిరిగి రావచ్చు

నితీష్ రాణా తిరిగి KKRలోకి రావచ్చు. అయితే మిచెల్ స్టార్క్‌ను ఈ మ్యాచ్‌లో బెంచ్‌పై కూర్చోబెట్టవచ్చు. వరుణ్ చక్రవర్తి స్థానంలో సుయాష్ శర్మను జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. RCB జట్టులో కూడా ఒక మార్పు కనిపించవచ్చు. రీస్ టోప్లీ స్థానంలో కామెరాన్ గ్రీన్‌ను ఫైనల్ 11లో చేర్చే అవ‌కాశం ఉంది.

హెడ్ ​​టు హెడ్ గణాంకాలు

కేకేఆర్, ఆర్‌సీబీ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న గణాంకాలను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు జరిగాయి. ఈ కాలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 19 మ్యాచ్‌లు, బెంగళూరు 14 మ్యాచ్‌లు గెలిచాయి. KKR మొదట బ్యాటింగ్ చేసిన 9 మ్యాచ్‌లు, ఛేజింగ్‌లో 10 మ్యాచ్‌లు గెలిచింది. మరోవైపు RCB మొదట బ్యాటింగ్ చేసిన 3 మ్యాచ్‌లు, ఛేజింగ్‌లో 11 మ్యాచ్‌లు గెలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో RCBతో జరిగిన 7 మ్యాచ్‌ల్లో KKR గెలిచింది. 4 ఓడింది. KKR తన సొంత మైదానంలో ఇప్పటివరకు 84 మ్యాచ్‌లు ఆడి 49 గెలిచింది. ఈడెన్ గార్డెన్‌లో RCB 12 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచింది.

Also Read: Baby Powder Vs Cancer : బేబీ పౌడర్ వాడిన మహిళకు రూ.375 కోట్లు.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు కోర్టు ఆర్డర్

ఇరు జ‌ట్ల అంచ‌నా

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ (WK), రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా.

ఇంపాక్ట్ ప్లేయర్: నితీష్ రాణా.

We’re now on WhatsApp : Click to Join

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పటీదార్, మహిపాల్ లోమ్రోర్, సౌరవ్ చౌహాన్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), విజయ్‌కుమార్ విశాక్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్.

ఇంపాక్ట్ ప్లేయర్: అనుజ్ రావత్.