IPL: ఇకపై రెండున్నర నెలల పాటు ఐపీఎల్

ఐపీఎల్‌ ఫాన్స్ కు లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఇక నుంచి ఈ మెగా లీగ్‌ 70 రోజులు పాటు అలరించబోతోంది.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 08:41 AM IST

ఐపీఎల్‌ ఫాన్స్ కు లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఇక నుంచి ఈ మెగా లీగ్‌ 70 రోజులు పాటు అలరించబోతోంది. ఐపీఎల్ కు 10 వారాల విండో ఇవ్వడానికి ఐసీసీ అంగీకరించినట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా చెప్పారు. రాయ్‌టర్స్‌ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడిన జే షా.. మరింత మంది అంతర్జాతీయ టాప్‌ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు.
ఈ విషయంపై ఐసీసీతోపాటు ఇతర క్రికెట్‌ బోర్డులతో మాట్లాడుతున్నామని చెప్పారు. వచ్చే ఐసీసీ ఫ్యూచర్ టూర్స్‌ ప్రోగ్రామ్‌లో ఐపీఎల్‌కు రెండున్నర నెలల విండో దక్కుతుందని తాను కచ్చితంగా చెప్పగలనని జై షా తెలిపారు. ఈ లీగ్‌ అందరికీ లబ్ధి చేకూర్చేది కాబట్టి.. ఐసీసీతోపాటు ఇతర బోర్డుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల సంఖ్య పదికి చేరడంతో రెండు నెలల పాటు ఈ మెగా లీగ్‌ జరిగింది. ఐపీఎల్‌ జరిగే సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌ సీరీస్ లు దాదాపుగా ఉండవు. దీంతో ఇంకొన్ని రోజులు కూడా వెసులుబాటు దొరికేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. మిగిలిన క్రికెట్ బోర్డుల్లో చాలా వరకూ బీసీసీఐకి మద్దతు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ లో గరిష్టంగా 74 మ్యాచ్‌లు జరుగుతుండగా… 2027 నుంచి 94 మ్యాచ్‌లు వరకూ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ 2024-2031 వరకూ తమ ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌పై చర్చించేందుకు వచ్చే వారం సమావేశం కానుంది.
ఈ సమావేశం తర్వాత ఐపీఎల్ విండో పై పూర్తి క్లారిటీ రానుంది. అయితే ఐపీఎల్ విండో పెంచితే అంతర్జాతీయ క్రికెట్ ప్రమాదంలో పడుతుందంటూ
వస్తున్న విమర్శలను జై షా కొట్టి పారేశారు. ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కులు 48 వేల కోట్లకు అమ్ముడవగా…లీగ్ 70 రోజుల పాటు జరిగితే బ్రాడ్ కాస్టర్లుకు కూడా మేలు జరుగుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వేలం సమయంలోనే ఐపీఎల్ విండో పెంపుపై బీసీసీఐ వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.