IPL Auction 2022 : ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలకు రూల్స్ ఇవే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో వేదికగా జరగబోతోంది. ఇప్పటికే పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయగా.. కొత్తగా వచ్చిన రెండు జట్లు వేలం కంటే ముందు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.

  • Written By:
  • Publish Date - February 5, 2022 / 12:02 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో వేదికగా జరగబోతోంది. ఇప్పటికే పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయగా.. కొత్తగా వచ్చిన రెండు జట్లు వేలం కంటే ముందు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఎట్టకేలకు మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్‌ని బీసీసీఐ అఫిషియల్‌గా రిలీజ్ చేసింది. దీంతో ఫ్రాంచైజీలన్నీ వేలం కోసం తుది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. వేలంలో పాల్గొనబోయే ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ ఫ్రాంచైజీ ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2022 వేలం బయో బబుల్ లో జరుగుతుంది. కరోనా నేపథ్యంలో ఫ్రాంచైజీల ప్రతినిధులంతా బబుల్ నిబంధనలను పాటించాలి. వేలానికి వచ్చే ప్రతినిధులంతా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. బీసీసీఐ వైద్య అధికారులు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ టెస్టులలో నెగిటివ్ వస్తేనే వేలానికి అనుమతి ఉంటుంది.ఈసారి వేలంలో రైట్ టు మ్యాచ్ ఆప్షన్ లేదు. అంటే.. గతంలో ఒక జట్టు తరఫున ఆడిన ఆటగాడు వేలంలోకి వెళ్లినప్పుడు అతడిని పలు జట్లు ఒక మొత్తానికి దక్కించుకుంటాయి. అయితే ఆ సందర్భంలో సదరు ఆటగాడి పాత జట్టే అతడిని వేలంలో అత్యధిక ధర పాడుకున్న జట్టుకు సమానమైన ధర చెల్లించి తిరిగి అతడిని దక్కించుకోవచ్చు. ఈసారి ఈ ఆప్షన్ తొలగించారు.ఈ వేలంలో ఆటగాళ్ల కోసం ఖర్చు పెట్టే మొత్తం 90 కోట్లకు మించకూడదు. గత సీజన్ లో ఇది 80 కోట్లుగా ఉండగా…ఈ సారి మరో 10 కోట్లు పెంచారు.విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ప్రతినిధులు ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే. వేలానికి ముందు బీసీసీఐ నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే అనుమతిస్తారు.అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా కరోనా పరీక్షలను నిర్వహిస్తారు. వేలానికి ఏ ఆటంకం కలగకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా నెగిటివ్ రిపోర్డులు ఉండి, లక్షణాలేమీ లేని ప్రతినిధులు మాత్రమే ప్రధాన వేదిక వద్దకు అనుమతించబడతారు. వేలానికి వచ్చే ప్రతినిధులంతా వారి కరోనా వ్యాక్సినేషన్ వివరాలను బీసీసీఐ అధికారులకు వెల్లడించాలి. ఆడిటోరియంలో ప్రతినిధులంతా మాస్కులు ధరించాలి.