Site icon HashtagU Telugu

IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ లో బ్యాటర్లదే హవా .. 700 సిక్సర్లు

IPL 2024

IPL 2024

IPL 2024: దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ లవర్స్ ను ఊర్రూతలూగిస్తూ ఐపీఎల్ సగం సీజన్ ను పూర్తి చేసుకుంది. ఈ హాఫ్ సీజన్ లోనే రికార్డుల మీద రికార్డులు బద్దలు కావడంతో పాటుగా సరికొత్త రికార్డ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ సీజన్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం. 20 ఓవర్లలో 250 పరుగుల మార్కును అందుకోవడానికి బ్యాటర్లు పెద్దగా కష్టపడటం లేదు. వచ్చినోళ్ళు వచ్చినట్టు బాదేస్తున్నారు.

ఏప్రిల్ 26 సాయంత్రం పంజాబ్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పంజాబ్ 262 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి టీ-20 ఫార్మెట్లోనే హైయెస్ట్ టార్గెట్ ఛేజ్ చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.అయితే ఈ సీజన్లో బ్యాటర్లకు ఓ పండుగల అనిపిస్తుంటే బౌలర్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు 260 పరుగుల స్కోరు ఏడుసార్లు దాటింది. టీ-20 క్రికెట్‌లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్‌లో 500కు పైగా పరుగులు కేవలం 7 సార్లు మాత్రమే నమోదయ్యాయి. అందులో ఈ సీజన్లో ఈ ఫీట్ మూడుసార్లు నమోదైంది. ఈ ఏడాది ఐపీఎల్ లో బౌలర్లు సగటు ఎకానమీ 9.49 వద్ద పరుగులు ఇచ్చారు.

ఇప్పటివరకు జరిగిన 42 మ్యాచ్‌లలో 24 సార్లు 200 పరుగుల మార్కును దాటాయి. ఈ సీజన్‌లో ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో 287 పరుగుల భారీ స్కోరు చేసింది. అదే సమయంలో ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఆడిన 42 మ్యాచ్‌ల్లో 700లకు పైగా సిక్సర్లు కొట్టారు. పంజాబ్, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 42 సిక్సర్లు కొట్టడం కొత్త రికార్డు. కేకేఆర్ జట్టు ఈ ఏడాది రెండుసార్లు 200 టార్గెట్ ని కాపాడుకోలేకపోయింది. పంజాబ్‌పై 261 పరుగులు, రాజస్థాన్‌పై 223 పరుగులు చేసినప్పటికీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.పంజాబ్ , కేకేఆర్ మ్యాచ్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టాడు. బౌలర్లను రక్షించాలని విజ్ఞప్తి చేశాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా అశ్విన్‌తో ఏకీభవవించాడు. సౌరవ్ గంగూలీ బ్యాటింగ్, బౌలింగ్ సమతూకం ఉండాలని ఆశించాడు.

Also Read: Wedding: బ్యాచిలర్స్‌కు బ్యాడ్ న్యూస్… పెళ్లి అవ్వాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే..!

Exit mobile version