Site icon HashtagU Telugu

Sanjeev Goenka Angry: సంజీవ్ గోయెంకా ఓవరాక్షన్… అప్పుడు ధోనీ.. ఇప్పుడు కేఎల్ రాహుల్.

Sanjeev Goenka Angry

Sanjeev Goenka Angry

Sanjeev Goenka Angry: ఐపీఎల్ టోర్నమెంట్ ప్లేఆఫ్ పోరు రసవత్తరంగా మారింది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటికే 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల్లో ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంది. ముంబై ఇండియన్స్ మినహా అన్ని జట్లూ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకోవడంతో.. కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన జట్టు యాజమాన్యాలు టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా జట్ల పేలవ ప్రదర్శనపై యాజమాన్యాల ఆగ్రహం మైదానంలో స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యజమాని పార్త్ జిందాల్ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌ను బహిరంగంగా తిట్టి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్‌జెయింట్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో కేఎల్ రాహుల్‌తో సంజీవ్ గోయెంకా కోపంగా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోయారు. అలాగే రాహుల్ ఫ్యాన్స్ లక్నో ఓనర్ని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు.

ఫ్రాంచైజీ యజమానులు నాలుగు గదుల మధ్య ఆటగాళ్లతో మాట్లడాలని, ఇలా పబ్లిక్‌గా మాట్లాడడం వల్ల క్రికెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేఎల్ రాహుల్ 2022 నుండి లక్నోకు నాయకత్వం వహిస్తున్నాడు. సంజీవ్ గోయెంకా 2022లో 7090 కోట్లకు ఫ్రాంచైజీ హక్కులను పొందారు. గత రెండు సీజన్లలో ఆ జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకుంది. కానీ టైటిల్ గెలవలేకపోయింది. అయితే ఈ ఏడాది ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఓ సందర్భంలో ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నాడు. 2017లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టు విషయంలోనూ అదే జరిగింది. ఈ జట్టు సంజీవ్ గోయెంకాకు చెందినది. ఓటములకు కెప్టెన్ ఎంఎస్ ధోనీని బాధ్యుడిని చేసి అతడిని పక్కనబెట్టి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ అప్పగించాడు. ఈ నిర్ణయంపై సంజీవ్ గోయెంకా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2016లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని పూణే సూపర్‌జెయింట్స్ 14 మ్యాచ్‌ల్లో ఐదు మాత్రమే గెలిచింది. అలాగే మహేంద్ర సింగ్ ధోనీ ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 284 పరుగులు మాత్రమే చేశాడు. 2017లో అకస్మాత్తుగా పుణె కెప్టెన్సీ నుంచి ధోనీని తొలగించారు. అలాగే జట్టు పేరును రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌గా మార్చారు.

Also Read: AP : పోలింగ్‌ రోజున మీరు వేసే ఓటుకు జగన్ ప్యాలెస్ బద్ధలుకావాలి – చంద్రబాబు

Exit mobile version