Site icon HashtagU Telugu

IPL Retention List: ఐపీఎల్ మెగా వేలం.. 10 జ‌ట్లు రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే!

SRH vs RR

SRH vs RR

IPL Retention List: వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ రోజు అన్ని ఐపీఎల్ జట్లు తాము రిటైన్ చేయాలనుకుంటున్న ఆటగాళ్ల పేర్లను (IPL Retention List) ప్రకటించనున్నాయి. దీనివల్ల నిర్దిష్ట ఆటగాడిని ఏ జట్టు ఎంత ధరకు, ఏ ధరకు రిటైన్ చేసిందో కూడా స్పష్టం అవుతుంది. ఈ సాయంత్రం అధికారికంగా తెలుస్తుంది. అయితే ప్రతి జట్టు నిలుపుదల ఆట‌గాళ్ల పేర్లు మీడియా నివేదికలు ఇప్ప‌టికే పేర్కొన్నాయి. ప్రతి జట్టుకు సాధ్యమయ్యే నిలుపుదల పూర్తి జాబితాను మ‌నం ఇక్క‌డ చూద్దాం.

గ‌త ఏడాది ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ సునీల్ నరైన్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణాలను రిటైన్ చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఈసారి జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్‌లను విడుదల చేయ‌నుంది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్‌లను విడుదల చేయ‌నుండ‌గా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకోవ‌చ్చు.

లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి నికోలస్ పురాన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్‌లను కొనసాగించే అవకాశం ఉంది.

Also Read: Diwali Safety Tips: దీపావ‌ళికి టపాసులు కాలుస్తున్నారా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి!

ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్.. ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుని శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లను మాత్రమే నిలబెట్టుకోనున్న‌ట్లు స‌మాచారం. 2016లో టైటిల్ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలను నిలబెట్టుకునే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, పరాగ్, సందీప్ శర్మలను జ‌ట్టులో కొనసాగించవచ్చు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతిషా పతిరానా, శివమ్ దూబేలను రిటైన్ చేసుకునే అవ‌కాశం ఉంది.

చెన్నై మాదిరిగానే ఐదుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న ముంబై ఇండియన్స్ కూడా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను రిటైన్ చేసుకోనుంది. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, రజత్ పాటిదార్ లను రిటైన్ చేసుకోనున్న‌ట్లు స‌మాచారం.