IPL Qualifier 1: ఆదుకున్న త్రిపాఠీ, క్లాసెన్, కమ్మిన్స్.. కోల్‌క‌తా ముందు ఈజీ టార్గెట్

ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫైయర్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు సత్తా చాటారు.

Published By: HashtagU Telugu Desk
KKR

KKR

IPL Qualifier 1: ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫైయర్ (IPL Qualifier 1)లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు సత్తా చాటారు. భారీస్కోర్లతో చెలరేగిపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్ లో నిరాశపరిచిన విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరోసారి డకౌటయ్యాడు. అభిషేక్ శర్మ 3 , నితీశ్ కుమార్ రెడ్డి 9 , షాబాజ్ అహ్మద్ కూడా డకౌటవ్వడంతో సన్ రైజర్స్ కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయంది. ఈ దశలో రాహుల్ త్రిపాఠీ , క్లాసెన్ కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ ఐదో వికెట్ కు 62 పరుగులు జోడించారు. త్రిపాఠీ హాఫ్ సెంచరీ చేయగా.. క్లాసెన్ 32 పరుగులు చేశాడు.

Also Read: RR vs RCB: నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్ఆర్ వ‌ర్సెస్ ఆర్సీబీలో ఏ జ‌ట్టు రాణించ‌గ‌ల‌దు..? పిచ్ రిపోర్ట్ ఇదే.!

అయితే కోల్ కతా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ పై ఒత్తిడి పెంచారు. చివర్లో ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధాటిగా ఆడి 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. విజయ్ కాంత్ తో కలిసి చివరి వికెట్ కు విలువైన పరుగులు చేయడంతో సన్ రైజర్స్ మంచి స్కోర్ సాధించింది. కోల్ కతా ఫీల్డింగ్ లోనూ అద్భుతంగా రాణించింది. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. కోల్ కతా బౌలర్లలో మిఛెల్ స్టార్క్ 3 , వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా… వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 21 May 2024, 09:50 PM IST