మెగా వేలానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే 79 కోట్లు వెచ్చించి 5 మంది ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను 18 కోట్లకు, మతిషా పతిరాన 13 కోట్లకు, శివమ్ దూబే 12 కోట్లకు, రవీంద్ర జడేజాను 18 కోట్లకు, ఎంఎస్ ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 4 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. ఈ ఆటగాళ్లను నిలబెట్టుకోవడం కోసం చెన్నై 79 కోట్లు వెచ్చించింది, అయితే తన కోర్ టీమ్‌ను అలాగే ఉంచుకుంది. ఇప్పుడు వేలంలో చెన్నై 55 కోట్లతో ఛాంపియన్ జట్టును సిద్ధం చేయాల్సి ఉంది. CSKకి ఎలాగో వ్యూహకర్తల కొరత లేదు. ధోని మైండ్ గేమ్ తో మ్యాచ్ విన్నర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 1 RTM కార్డ్ మిగిలి ఉంది.
ఈ పరిస్థితిలో ఎవరిని తీసుకొంటారో చూడాలి. ఐపీఎల్ వర్గాల సమాచారం మేరకు వేలంలో చెన్నై స్టార్ కివీ క్రికెటర్ డెవాన్ కాన్వే కోసం RTM కార్డును ఉపయోగించాలనుకుంటుంది. అది కుదరకపోతే రచిన్ రవీంద్ర లేదా దీపక్ చాహర్ కోసం ఉపయోగించవచ్చు. కాగా రీటెన్షన్ ప్రక్రియలో చెన్నై యాజమాన్యం చాలా మంది మ్యాచ్ విజేతలను విడుదల చేసింది. ఇప్పుడు అతి తక్కువ పర్స్ వాల్యూతో వేలంపాటలోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో చెన్నై సీనియర్లను తక్కువ ధరకు తీసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఫాఫ్ డు ప్లెసిస్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే సహా పలువురు ఆటగాళ్లని లైన్లొ పెట్టిందట. ఇక ధోనికి చాలా ఇష్టమైన ప్లేయర్ రిషబ్ పంత్‌ను కొనుగోలు చేయాలని చెన్నై కోరుకుంటుంది. తద్వారా ధోని బ్యాకప్‌గా ఈ ఆటగాడికి బాధ్యతలు అప్పగించవచ్చు.ఏదేమైనా చెన్నై జట్టు కూర్పు ధోనీ చేతుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా వేలం ప్రక్రియ సమయాల్లో కాస్త మార్పు చోటు చేసుకుంది. ముందుగా భారత కాలమానం ప్రకారం మెగా వేలం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు వేలం సమయం మారింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం ప్రారంభమవుతుంది. ఒకవైపు భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్ జరుగుతుంది. మొదటి టెస్ట్ నవంబర్ 22 నుండి ప్రారంభమైంది. అయితే నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో మెగావేలం మరియు పెర్త్ టెస్ట్ లను దృష్టిలో ఉంచుకుని బ్రాడ్‌కాస్టర్లు భయపడుతున్నారు. పెర్త్ టెస్టు మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసినప్పటికీ స్లో ఓవర్‌రేట్ వంటి కారణాల వల్ల మ్యాచ్ మరికొంత సమయం పొడిగించవచ్చు. అందువల్ల ఈ ఆందోళనను తొలగించడానికి ప్రసారకర్తలు అరగంట సమయాన్ని పెంచాలని బీసీసీఐని అభ్యర్థించారు.
Read Also : Axar Patel: అక్షర్ పటేల్ కు ఢిల్లీ పగ్గాలు.. ఇవాళ క్లారిటీ!