Site icon HashtagU Telugu

IPL 2022 : 2018 వేలంలో మోసపోయాను:హర్షల్ పటేల్

Harshal Patel

Harshal Patel

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదుగుతున్నాడు. గతేడాది ఐపీఎల్ లో 15 మ్యాచ్చులాడిన ఆడిన అతడు అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ సొంతమ్ చేసుకున్నాడు..అయితే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ఆర్సీబీ హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ను రీటైన్ చేసుకోలేదు కానీ వేలంలో మాత్రం రూ.10.75 కోట్ల‌కు హర్షల్ ను ఆర్సీబీ కొనుగోలుచేసింది. వేలంలో హ‌ర్ష‌ల్ ప‌టేల్ కనీస ధర 2 కోట్లుగా ఉండగా అతని కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఆర్సీబీ ఆఖరి వ‌ర‌కు పోటీ ప‌డ్డాయి. గ‌త సీజ‌న్‌లో హర్షల్ పటేల్ ను ఆర్సీబీ కేవ‌లం 20 ల‌క్ష‌ల‌కు మాత్ర‌మే కోనుగోలు చేయగా.. ఇప్పుడు అదే ఫ్రాంచైజీ అత‌డిని 10.75 కోట్ల‌కు కోనుగోలు చేసింది. ఇక అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్న హర్షల్‌ ఐపీఎల్‌-2022లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు.

తాజాగా 2018 ఐపీఎల్ వేలంలో తాను మోసపోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఐపీఎల్ లో తనకెదురైన చేదు అనుభవాన్ని హర్శల్ పటేల్ వెల్లడించాడు.. ఐపీఎల్ 2018 సీజన్ వేలం జరుగుతున్నప్పుడు.. నన్ను ఎవరు కొనుగోలు చేస్తారోనని ఆశగా ఎదురుచూశాను. ఆ సమయంలో నేనసలు డబ్బుల గురించి ఆలోచించలేదు.కేవలం నన్ను ఏదైనా జట్టుకు కొనుగోలు చేయాలి అని మాత్రమే అనుకున్నాను. అంతకుముందే కొన్ని ఫ్రాంఛైజీలకు చెందిన ఓ నలుగురు ఆటగాళ్లు నన్ను తమ జట్టు కోసం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పినట్లు ఆ పని చేయలేకపోయారు. ఆ సమయంలో మోసపోయానన్న అంశం నా మనసును తీవ్రంగా గాయపరిచింది దాని గురించి చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత నా ప్రతిభపై నమ్మకంతో తిరిగి ఆటపై దృష్టి సారించి విజయవంతమయ్యాను అని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version