Site icon HashtagU Telugu

IPL Finals Postponed: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సోమవారానికి వాయిదా

Ipl Finals

Ipl Finals

IPL 2023 Finals: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు వరణుడు ఊహించని షాకిచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగాల్సిన మెగా ఫైనల్ వర్షం కారణంగా వాయిదా పడింది. ఐదు గంటల పాటు ఎడ తెరిపిలేకుండా కురిసిన వర్షంతో మైదానం తడిసి ముద్దైంది.

 

పిచ్ రిపోర్ట్ సమయంలో ప్రారంభమైన వర్షం ఇంకా పడుతూనే ఉంది. మధ్య మధ్యలో దాగుడు మూతలు ఆడిన వర్షం ఆటకు ఏ మాత్రం సహకరించలేదు. పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో రిజర్వ్ డే అయిన సోమవారానికి మ్యాచ్‌ను వాయిదా వేసారు.