ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, యశ్ ధుల్, విజయ్ శంకర్, దీపక్ హుడా, అల్జారీ జోసెఫ్ వంటి ప్రముఖ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు.

Published By: HashtagU Telugu Desk
Unsold Players

Unsold Players

  • ముగిసిన ఐపీఎల్ మినీ వేలం
  • ఈ వేలంలో అమ్ముడుపోని ప్ర‌ముఖ ఆట‌గాళ్లు

Unsold Players: అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, యశ్ ధుల్, విజయ్ శంకర్, దీపక్ హుడా, అల్జారీ జోసెఫ్ వంటి ప్రముఖ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు.

వేలం గణాంకాలు

ఈ వేలంలో మొత్తం 369 మంది ఆటగాళ్లు బరిలోకి దిగగా అందులో 253 మంది భారతీయులు, 116 మంది విదేశీయులు.

10 జట్లలో కలిపి మొత్తం 77 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.

అన్ని జట్లు ఈ సీజన్ కోసం గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తమతో చేర్చుకున్నాయి.

ఈ వేలంలో మొత్తం 215.45 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి.

రికార్డు ధరలు

కామెరాన్ గ్రీన్: రూ. 25.20 కోట్లతో ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ: వీరిద్దరినీ చెన్నై సూపర్ కింగ్స్ తలో రూ. 14.2 కోట్లకు కొనుగోలు చేసింది. వీరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు.

Also Read: పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా

30 లక్షల రూపాయల బేస్ ప్రైజ్: అంబ్రిష్, స్వాస్తిక్ చికారా, చామా మిలింద్, హృతిక్ తడ, సిద్ధార్థ్ యాదవ్, మెక్నీల్ నోరోన్హా, మణి గ్రేవాల్, మయాంక్ డాగర్, మనన్ వోహ్రా, మణిశంకర్ మూరాసింగ్, ఎజాజ్ సవారియా, జిక్కు బ్రైట్, ఆయుష్ వర్తక్, ఉత్కర్ష్ సింగ్, కరణ్ లాల్, డేనియల్ లాటెగన్, చింతల్ గాంధీ, ఇర్ఫాన్ ఉమైర్, కానర్ ఎస్టర్హాజన్, తనయ్ త్యాగరాజన్, ఎం ధీరజ్ కుమార్, మోహిత్ రాఠీ, కె.సి. కరియప్ప, తేజస్ బరోకా, ఎం అశ్విన్, అన్మోల్ ప్రీత్ సింగ్, సల్మాన్ నిజార్, కుమార్ కార్తికేయ, శివం శుక్లా, వాహిదుల్లా జద్రాన్, ఆకాష్ మధ్వాల్, సిమర్జీత్ సింగ్, రాజ్ లింబాని, తుషార్ రహేజా, వంశ్ బేడి, రుచిత్ అహిర్, సన్వీర్ సింగ్, కమలేష్ నాగర్ కోటి, తనుష్ కోటియాన్, ఈడెన్ ఆపిల్ టామ్, యశ్ ధుల్, అథర్వ తాయడే, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, అభినవ్ తేజరాణా, ఆర్య దేశాయ్.

40 లక్షల రూపాయల బేస్ ప్రైజ్: రాజ్ వర్ధన్ హంగర్గేకర్, కె.ఎం. ఆసిఫ్.

50 లక్షల రూపాయల బేస్ ప్రైజ్: కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రోర్.

75 లక్షల రూపాయల బేస్ ప్రైజ్: చేతన్ సాకరియా, దసున్ షనక, సెదికుల్లా అటల్, నాథన్ స్మిత్, రిచర్డ్ గ్లీసన్, తస్కిన్ అహ్మద్, శ్రీకర్ భరత్, దీపక్ హుడా.

1 కోటి రూపాయల బేస్ ప్రైజ్: వకార్ సలాంఖైల్, విల్ సదర్లాండ్, ఫజల్హాక్ ఫారూఖీ, వియాన్ ముల్డర్, జానీ బెయిర్‌స్టో.

1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్: స్పెన్సర్ జాన్సన్, జే రిచర్డ్సన్, రైలీ మెరెడిత్, రహ్మానుల్లా గుర్బాజ్.

2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్: జెరాల్డ్ కోయెట్జీ, డెవాన్ కాన్వే, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్, మహీష్ తీక్షణ, అల్జారీ జోసెఫ్, డాన్ లారెన్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, సీన్ అబాట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.

  Last Updated: 17 Dec 2025, 09:44 AM IST