KL Rahul: భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) తన ఫామ్ కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐపీఎల్ 2025 కోసం రాహుల్‌ను రిటైన్ చేయలేదు. ఇప్పుడు రాహుల్ ఏ జట్టులోకి వస్తాడనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అతను తన పాత ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరడం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాతో వివాదం తర్వాత అతనిని కొనసాగించకూడదని రాహుల్ స్వయంగా తన కోరికను వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ధోనీ లేదా విరాట్ ఎవరి జట్టుకు వెళ్తారు?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాహుల్‌ను ధోనీ, విరాట్ కోహ్లీ మధ్య ఎవరి జట్టులో చేరాలనుకుంటున్నారని అడిగారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీలలో ఏదైనా ఒక జట్టులోకి వెళ్లాల్సి వస్తే ఏ జట్టులోకి వెళతారని అడిగారు. RCB అతని పాత ఫ్రాంచైజీ కానీ రాహుల్ ఏ జట్టు పేరును పేర్కొనలేదు. రాహుల్ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఈ ప్రశ్న చాలా కష్టం. నేను వారందరితో ఆడటం ఆనందించాను. వారిలో ఒకరిని ఎంచుకోవడం కష్టం’ అని చెప్పాడు. లక్నోను కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాల వలన వదిలిపెట్టాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: AP High Court: సోషల్ మీడియా అక్టీవిస్టుల అరెస్ట్ పై హైకోర్టులో వైసీపీ పిల్.. సీరియస్ అయినా హైకోర్టు
రాహుల్ కోసం RCB పర్సులో డబ్బు ఆదా చేసిందా?
త్వరలో జరగనున్న మెగా వేలంలో రాహుల్ కోసం RCB ఇప్పటికే 30 కోట్ల రూపాయలను కేటాయించిందని, తద్వారా KL రాహుల్‌ను ఎలాగైనా తమ జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం. రాహుల్ గతంలో కూడా బెంగళూరు తరఫున ఆడడం గమనార్హం. అతను 2013లో RCB తరపున అరంగేట్రం చేసాడు. నాలుగు సీజన్లలో జట్టుతో అనుబంధం కొనసాగించాడు. ఈ సమయంలో అతను బెంగళూరు తరపున 19 మ్యాచ్‌లలో 417 పరుగులు చేశాడు. మరి వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఈ డీల్ ఎలా ఖరారు అవుతుందో చూడాలి. రాహుల్ RCBలో చేరితే అతనిపై జట్టు ఎంత డబ్బు బిడ్ చేస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఆసీస్ పర్యటనకు సిద్ధం అవుతున్నాడు.