Site icon HashtagU Telugu

10 Teams Full Squads: ముగిసిన వేలం.. ఐపీఎల్‌లో 10 జ‌ట్ల పూర్తి స్క్వాడ్ ఇదే!

IPL 2025 Refund

IPL 2025 Refund

10 Teams Full Squads: రెండు రోజులపాటు సాగిన ఐపీఎల్‌ మెగా వేలం (10 Teams Full Squads) ముగిసింది. తొలి రోజే స్టార్ ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చుపెట్టిన ఫ్రాంఛైజీలు.. సోమవారం చాలా జాగ్ర‌త్త‌గా వేలం కొన‌సాగించాయి. త‌మ జ‌ట్టులోని బ‌ల‌హీన‌త‌ను భ‌ర్తీ చేసేందుకు ఆట‌గాళ్ల స్కిల్స్‌ను బ‌ట్టి డ‌బ్బు వెచ్చించాయి. ఈ వేలంలో తొలి రోజు స్పిన్న‌ర్లు, బ్యాట‌ర్ల హ‌వా కోన‌సాగ‌గా.. రెండో రోజు బౌల‌ర్ల‌కు మంచి డిమాండ్ వ‌చ్చింది. ముఖ్యంగా టీమిండియా బౌల‌ర్ల‌పై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మ‌రించాయి. అయితే ఈ మెగా వేలంలో మొత్తం 10 జ‌ట్లు క‌లిపి దాదాపు రూ. 640 కోట్లు (రూ. 639.15 కోట్లు) ఖ‌ర్చు చేశాయి.

సౌతాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన ఈ వేలంలో మొత్తం 182 మంది ఆట‌గాళ్ల‌ను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 62 మంది విదేశీ ప్లేయ‌ర్లపై జ‌ట్లు మ‌క్కువ చూపాయి. ఇక ఈ వేలంలో సీఎస్కే, పంజాబ్ కింగ్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు 25 మంది ఆటగాళ్లతో జ‌ట్లు ఉండేలా ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌గా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు 20 మంది ఆటగాళ్లను ద‌క్కించుకున్నాయి. ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ 23 మంది చొప్పున.. కేకేఈఆర్ 21, ల‌క్నో 24, బెంగళూరు 22 మంది ఆటగాళ్లను వేలంలో ద‌క్కించుకున్నాయి. వేలం ముగిశాక బెంగళూరు దగ్గర రూ.75 లక్షలు.. చెన్నై, కోల్‌కతా దగ్గర రూ.5 లక్షలు మిగిలాయి.

Also Read: Rajiv Swagruha : రాజీవ్‌ స్వగృహ ఇళ్లు, భూముల వేలంపాటకు రంగం సిద్ధం

పూర్తి జట్లు ఇవే!

చెన్నై సూప‌ర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్‌, ర‌వీంద్ర‌ జడేజా, మ‌తీషా పతిరన, శివమ్‌ దూబె, నూర్‌ అహ్మద్‌, అశ్విన్‌, కాన్వే, ఖలీల్‌, ఎంఎస్ ధోని, రచిన్ ర‌వీంద్ర‌, అన్షుల్, రాహుల్‌ త్రిపాఠి, సామ్‌ కరన్‌, గుర్జప్‌నీత్‌, ఎలిస్‌ దీపక్‌ హుడా, జేమీ ఒవర్టన్‌, విజయ్‌ శంకర్‌, వంశ్‌, శ్రేయస్‌ గోపాల్, ఆండ్రీ సిద్ధార్థ్, రామకృష్ణ, నాగర్‌కోటి, ముకేశ్‌ చౌదరి, షేక్‌ రషీద్‌.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

అక్షర్ ప‌టేల్‌, కేఎల్‌ రాహుల్‌, కుల్‌దీప్‌, స్టార్క్‌, నటరాజన్‌, స్టబ్స్‌, ఫ్రేజర్‌, ముకేశ్‌ కుమార్‌, హ్యారీబ్రూక్‌, అభిషేక్‌, అశుతోష్‌, మోహిత్‌ శర్మ, డుప్లెసిస్‌, సమీర్‌ రిజ్వీ, డొనోవాన్, చమీర, విప్రజ్, కరుణ్‌ నాయర్‌, మాధవ్‌, మాన్వంత్, త్రిపురణ విజయ్, దర్శన్, అజయ్‌.

గుజరాత్ టైటాన్స్‌

రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌, బట్లర్‌, సిరాజ్‌, రబాడ, ప్రసిద్ధ్‌ కృష్ణ, సాయి సుదర్శన్‌, తెవాతియా, షారుక్‌ ఖాన్‌, సుందర్‌, రూథర్‌ఫర్డ్‌, కొయెట్జీ, గ్లెన్‌ ఫిలిప్స్, సాయి కిశోర్‌, మహిపాల్‌ లొమ్రోర్‌, గుర్నూర్, అర్షద్‌ ఖాన్‌, జయంత్‌ యాదవ్, ఇషాంత్‌ శర్మ, జనత్‌, కుశాగ్ర, మానవ్, అనుజ్, నిశాంత్, కుల్వంత్‌

కోల్‌కతా నైట్ రైడ‌ర్స్‌

వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు, వరుణ్‌, నరైన్‌, రసెల్‌, నోకియా, హర్షిత్, రమణ్‌దీప్‌, డికాక్‌, రఘువంశీ, స్పెన్సర్‌, గుర్బాజ్, మొయిన్‌ అలీ, వైభవ్‌, రహానె, పావెల్‌, ఉమ్రాన్‌ మలిక్, మనీశ్‌ పాండే, అనుకుల్‌, లవ్‌నిత్, మార్కండె.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌

పంత్‌, పూరన్‌ , రవి బిష్ణోయ్, మయాంక్‌ యాదవ్‌, అవేశ్‌ ఖాన్‌, ఆకాశ్‌ దీప్‌, మిల్లర్‌, సమద్‌, మోసిన్, బదోని, మార్ష్‌, షాబాజ్‌, మార్‌క్రమ్‌, బ్రిట్జ్‌కె, షమార్, సిద్ధార్థ్‌, యువ్‌రాజ్‌ చౌదరి, ప్రిన్స్, ఆకాశ్, దిగ్వేశ్, హిమ్మత్, రాజ్‌వర్ధన్, ఆర్యన్, అర్శిన్‌.

ముంబై ఇండియ‌న్స్‌

బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్‌, రోహిత్‌, బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, తిలక్‌, విల్‌ జాక్స్, నమన్‌ ధీర్‌, గజన్‌ఫర్‌, శాంట్నర్‌, రికిల్టన్‌, టాప్లీ, లిజాడ్‌, రాబిన్‌, కర్ణ్‌ శర్మ, సత్యనారాయణ, రాజ్‌ అంగద్, శ్రీజిత్, అశ్వని కుమార్, అర్జున్‌ తెందుల్కర్, విఘ్నేశ్, బెవాన్‌.

పంజాబ్ కింగ్స్‌

శ్రేయస్‌, చాహల్, అర్ష్‌దీప్‌, స్టోయినిస్‌ , యాన్సెన్‌, శశాంక్‌ సింగ్‌, నేహాల్, మ్యాక్స్‌వెల్‌, ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాంశ్‌, ఇంగ్లిస్‌, అజ్మతుల్లా, ఫెర్గూసన్‌, వైశాఖ్‌, యశ్‌ ఠాకూర్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ఆరోన్‌ హార్డీ, విష్ణు వినోద్‌, బార్ట్‌లెట్, కుల్‌దీప్‌ సేన్‌, అవినాష్, సుయాంశ్, ముషీర్, హర్నూర్, ప్రవీణ్‌.

రాజస్థాన్ రాయ‌ల్స్‌

శాంసన్, జైస్వాల్‌, పరాగ్, ధ్రువ్‌, ఆర్చర్‌, హెట్‌మయర్‌, తుషార్‌, హసరంగ, తీక్షణ, నితీశ్‌ రాణా, సందీప్‌, ఫజల్‌హక్‌, మపాక, ఆకాశ్‌ మధ్వాల్‌, వైభవ్‌, శుభమ్‌, యుధ్‌వీర్‌, కుమార్‌ కార్తీకేయ, కునాల్, అశోక్‌.

బెంగళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

కోహ్లీ, హేజిల్‌వుడ్‌, ఫిల్‌ సాల్ట్‌, జితేశ్, రజత్‌, భువనేశ్వర్‌, లివింగ్‌స్టన్‌, రసిక్‌ సలాం, కృనాల్‌, యశ్‌ దయాల్‌, టిమ్‌ డేవిడ్‌, బెతెల్, సుయాశ్‌, పడిక్కల్‌, నువాన్‌, షెఫర్డ్‌, ఎంగిడి, స్వప్నిల్‌, స్వస్తిక్, మనోజ్, అభినందన్, మోహిత్‌.

స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్‌

క్లాసెన్‌, కమిన్స్‌, అభిషేక్, హెడ్‌, ఇషాన్‌ కిషన్‌, షమీ, హర్షల్ ప‌టేల్‌, నితీశ్ కుమార్‌, అభినవ్, రాహుల్‌ చాహర్‌, జంపా, సిమర్‌జీత్‌, ఇషాన్‌ మలింగ, కార్స్, ఉనద్కత్‌, కమిందు, జీషన్‌, సచిన్‌ బేబీ, అనికేత్, అథర్వ.