Site icon HashtagU Telugu

IPL Auction 2022: పంజాబ్ కింగ్స్…టీమ్ నిండా హిట్టర్లే

PBKS Team 2025 Player List

PBKS Team 2025 Player List

ఐపీఎల్‌ 2022 సీజన్ మెగావేలంలో పంజాబ్ కింగ్స్ ఈసారి రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది. మొత్తం 25 మంది ఆటగాళ్లలో 18 మంది భారత్‌కు చెందినవారు కాగా.. 7 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రిటైన్‌ జాబితాలో మయాంక్‌ అగర్వాల్‌, అర్షదీప్‌ సింగ్‌ను మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది. మిగిలిన ఆటగాళ్లను వేలంలో మెగావేలంలో కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మెగా వేలం ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టును ఒకసారి చూస్తే హిట్టర్లే కనిపిస్తున్నారు.

ఈ మెగా వేలంలో స్టార్ ఆల్ రౌండర్ లివింగ్‌ స్టోన్ ను అత్యధికంగా రూ. 11.50 కోట్లు చెల్లించి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.. అలాగే స్టార్ పేసర్ కగిసో రబాడ ను రూ. 9.25 కోట్లు, యువ సంచలనం షారుఖ్‌ ఖాన్‌ను రూ. రూ. 9 కోట్లు, సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ను రూ. 8.25 కోట్లు, స్టార్ ఓపెనర్ జాన్‌ బెయిర్‌ స్టోను రూ. 6.75 కోట్లు, నయా ఆల్ రౌండర్ ఒడియన్‌ స్మిత్ను రూ. 6 కోట్లు చెల్లించి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కైవసం చేసుకుంది… అలాగే యువ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ ను రూ. 5.25 కోట్లు, హర్‌ప్రీత్‌ సింగ్‌ ను రూ. 3.80 కోట్లు, రాజ్‌ బవాను రూ. 2 కోట్లు, అలాగే వైభవ్‌ అరోరాను రూ. 2 కోట్లు, నాథన్‌ ఎల్లిస్‌ ను రూ. 75 లక్షలు, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ ను రూ. 60 లక్షలు చెల్లించి పంజాబ్ దక్కించుకుంది. వీరితో పాటుగా రిషి ధావన్‌ ను రూ. 55 లక్షలు, భనుక రాజపక్సను రూ. 50 లక్షలు, సందీప్‌ శర్మను రూ. 50 లక్షలు, బెన్నీ హోవెల్ ను రూ. 40 లక్షలు, బాల్‌తేజ్‌ ధండ, అన్ష్‌ పటేల్‌, రిటిక్‌ ఛటర్జీ, ప్రేరక్‌ మన్‌కడ్‌, అథర్వ తైడే, జితేష్ శర్మ, ఇషాన్‌ పోరెల్లను తలో రూ. 20 లక్షలు వెచ్చించి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

Exit mobile version