ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ టికెట్ల‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే?!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ వంటి ఆటగాళ్ల మెరుపు బ్యాటింగ్‌ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
IPL 2026

IPL 2026

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ పోరు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ల విక్రయం నేటి నుండే ప్రారంభమవుతోంది. టికెట్లు ఎక్కడ కొనాలి, ధరలు ఎలా ఉన్నాయో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ వంటి ఆటగాళ్ల మెరుపు బ్యాటింగ్‌ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న విరాట్ కోహ్లీని చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌ను స్టేడియం నుండి వీక్షించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.

RCB vs SRH మ్యాచ్ టికెట్లు ఎక్కడ కొనాలి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ లోని చాలా మ్యాచ్‌ల టికెట్లు ‘బుక్ మై షో’లో లభిస్తున్నప్పటికీ ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్‌లో జరిగే మొదటి మ్యాచ్ టికెట్లు మాత్రం కేవలం ఆర్సీబీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దొరుకుతాయి. “టికెట్లు కేవలం RCB అధికారిక వెబ్‌సైట్, యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. RCB టికెట్లు అమ్ముతున్నామని క్లెయిమ్ చేసే ఇతర నకిలీ వెబ్‌సైట్ల బారిన పడకండి” అని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆర్‌సీబీ మ్యాచ్ టికెట్ కలిగిన వారు మ్యాచ్ రోజున మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Also Read: Gut Health: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.. తినాల్సిన ఫుడ్స్

RCB vs SRH టికెట్లు బుక్ చేయడం ఎలా?

  • ఆర్‌సీబీ అధికారిక బుకింగ్ ప్లాట్‌ఫారమ్ (shop.royalchallengers.com) లేదా ఆర్‌సీబీ యాప్‌ను సందర్శించండి.
  • మీకు నచ్చిన స్టాండ్, సీటును ఎంచుకోండి. ఆ తర్వాత టికెట్ల సంఖ్యను ఖరారు చేయండి.
  • పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మీ ఈ-టికెట్ (E-ticket) మీకు అందుతుంది.

టికెట్ ధరలు ఎంత?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్ ధరలు రూ. 3,750 నుండి ప్రారంభమవుతున్నాయి. అత్యంత ఖరీదైన టికెట్ ధర రూ. 47,000 నుండి మొదలై, డైనమిక్ ప్రైసింగ్ ప్రకారం రూ. 65,800 వరకు ఉంది. ప్లాటినం లాంజ్ ధరలు రూ. 25,000 నుండి రూ. 35,000 మధ్యలో ఉన్నాయి

  Last Updated: 24 Mar 2026, 01:01 PM IST