- మరోసారి ఐపీఎల్ మినీ వేలం హోస్ట్‌గా మల్లికా సాగర్
- మరికాసేపట్లో అబుదాబి వేదికగా మొదలుకానున్న ఐపీఎల్ వేలం
- మొత్తం 369 మంది ఆటగాళ్ల భవితవ్యాన్ని నిర్ణయించే బాధ్యత ఆమెదే
Mallika Sagar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో వేలం నిర్వహించే బాధ్యత రిచర్డ్ మాడ్లీ చేతుల్లో ఉండేది. ఆ తర్వాత హ్యూ ఎడ్మీడ్స్, ఆపై చారు శర్మ కూడా ఈ బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2024 నుండి మల్లికా సాగర్ వేలం నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా ఐపీఎల్ 2026 మినీ వేలంలో 369 మంది ఆటగాళ్ల భవితవ్యాన్ని నిర్ణయించే బాధ్యత ఆమెకే దక్కింది.
వేలం నిర్వాహకురాలిగా మల్లికా సాగర్
ఐపీఎల్ వేలంలో మల్లికా సాగర్ ఒక ముఖ్యమైన భాగమైపోయారు. ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఒక చారిత్రాత్మక ప్రయాణం ఉంది. 1975లో ముంబైలో జన్మించిన మల్లిక, ఒక వ్యాపార కుటుంబానికి చెందినవారు. ‘ఫైన్ ఆర్ట్స్’, ‘క్రీడా వేలం’ అనే రెండు భిన్నమైన రంగాలను ఆమె తన కెరీర్‌తో అనుసంధానించారు. ఒక మహిళా వేలం నిర్వాహకురాలు ప్రధాన పాత్రలో ఉన్న పుస్తకాన్ని చదవడం ద్వారా ఆమెకు ఈ రంగంపై ఆసక్తి కలిగింది. ఆమె ఫిలడెల్ఫియాలోని ‘బ్రిన్ మావర్ కాలేజీ’ నుండి ఆర్ట్ హిస్టరీలో డిగ్రీ పొందారు. కేవలం 26 ఏళ్ల వయస్సులో న్యూయార్క్‌లోని ప్రసిద్ధ ‘క్రిస్టీస్’ సంస్థలో మొదటి భారతీయ మహిళా వేలం నిర్వాహకురాలిగా గుర్తింపు పొందారు.
Also Read: లోక్‌సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!
తొలి భారతీయ మహిళా వేలం నిర్వాహకురాలు
మల్లికా సాగర్ తన కెరీర్‌లో అనేక మైలురాళ్లను అధిగమించారు. ప్రో కబడ్డీ లీగ్‌లో 2012లో నిర్వహించిన వేలంలో మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రెండేళ్ల తర్వాత మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిర్వహించే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె ఐపీఎల్ 2024 మినీ వేలం,సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని విజయవంతంగా నిర్వహించారు. గత నెలలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి కూడా మల్లికా సాగరే ఆక్షనర్‌గా వ్యవహరించారు.
