- ఐపీఎల్‌లో రికార్డు ధరకు అమ్ముడైన గ్రీన్
- రూ. 25.20 కోట్లకు గ్రీన్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్
IPL 2026 Auction: అంచనాలకు తగ్గట్టే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ భారీ ధర పలికాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతడిని ఏకంగా రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రారంభంలో కోల్‌కతా, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొనగా ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా రంగంలోకి దిగింది. కేకేఆర్, సీఎస్‌కే మధ్య హోరాహోరీగా సాగిన ‘బిడ్డింగ్ వార్’లో చివరకు షారూఖ్ ఖాన్ జట్టు విజయం సాధించింది.
టీ20 ఇంటర్నేషనల్‌లో గ్రీన్ ప్రదర్శన
2022 నుండి ఇప్పటివరకు గ్రీన్ ఆస్ట్రేలియా తరపున 21 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
పరుగులు: 521
సగటు: 32.56 | స్ట్రైక్ రేట్: 160.30
విశేషాలు: 6 అర్ధ సెంచరీలు (42 ఫోర్లు, 31 సిక్సర్లు).
బౌలింగ్: 12 వికెట్లు (సగటు: 23.25, ఎకానమీ: 8.90). ఉత్తమ గణాంకాలు: 3/35.
Also Read: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?
🚨 HISTORIC MOMENT 🚨
CAMERON GREEN – Most Expensive overseas player in IPL History. pic.twitter.com/1jjq3J6GS7
— Johns. (@CricCrazyJohns) December 16, 2025
ఐపీఎల్ (IPL)లో గ్రీన్ గణాంకాలు
గ్రీన్ గత రెండు సీజన్లలో ఐపీఎల్ ఆడాడు (2023లో ముంబై ఇండియన్స్, 2024లో ఆర్‌సీబీ)
మ్యాచ్‌లు: 29 (28 ఇన్నింగ్స్‌లు)
పరుగులు: 707
సగటు: 41.6 | స్ట్రైక్ రేట్: 153.7
విశేషాలు: 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలు (62 ఫోర్లు, 32 సిక్సర్లు).
గమనిక: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అతను బౌలింగ్ చేయలేదు.
ఓవరాల్ టీ20 రికార్డులు (అన్ని మ్యాచ్‌లు కలిపి)
మొత్తం టీ20 కెరీర్‌లో గ్రీన్ గణాంకాలు
మ్యాచ్‌లు: 63
పరుగులు: 1334 (సగటు: 33.35, స్ట్రైక్ రేట్: 151.07)
విశేషాలు: 1 సెంచరీ, 8 అర్ధ సెంచరీలు (111 ఫోర్లు, 63 సిక్సర్లు).
బౌలింగ్: 28 వికెట్లు (సగటు: 34.42, ఎకానమీ: 9.05).
