IPL 2026 Auction: ఐపీఎల్ వేలం జ‌రిగే తేదీ, దేశం ఇదే!

ఏ జట్టులో ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయి, వారి పర్స్‌లో ఎంత డబ్బు ఉందో స్పష్టమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఉండగా, ముంబై ఇండియన్స్ (MI) వద్ద అత్యల్పంగా ఉంది.

Published By: HashtagU Telugu Desk
IPL 2026

IPL 2026

IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 19 (IPL 2026 Auction) కోసం జరగబోయే వేలం తేదీని ప్రకటించారు. శనివారం అన్ని జట్ల రిటెన్షన్ లిస్ట్ వెలువడింది. దీనితో ఏ జట్టులో ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయి, వారి పర్స్‌లో ఎంత డబ్బు ఉందో స్పష్టమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఉండగా, ముంబై ఇండియన్స్ (MI) వద్ద అత్యల్పంగా ఉంది.

వేలం ఎప్పుడు?

IPL 2026 కోసం జరగబోయే వేలం మంగళవారం, డిసెంబర్ 16న ఉంటుంది.

Also Read: Sukanya Samriddhi Yojana Interest Rate : పోస్టాఫీస్ స్కీమ్స్.. రూ. 10 వేలు జమ చేస్తే ఎంతొస్తుంది..! 

వేలం ఎక్కడ?

ఐపీఎల్ వేలం ఈసారి కూడా భారతదేశంలో జరగదు. అధికారిక ప్రకటనలో తెలిపిన విధంగా.. వేలం అబుదాబి (Abu Dhabi)లో జరగ‌నుంది.

మొత్తం 77 స్లాట్‌లు, రూ. 237 కోట్లు ఖర్చు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. వేలానికి ముందు అన్ని జట్లు తమకు అవసరం లేని కొంతమంది ఆటగాళ్లను విడుదల చేశాయి. ఇప్పుడు మిగిలిన ఆ ఖాళీ స్లాట్‌ల కోసం డిసెంబర్ 16న వేలంలో బిడ్లు వేయనున్నాయి.

మొత్తం వివరాలు

  • అన్ని 10 జట్లలో కలిపి మొత్తం 77 మంది ఆటగాళ్ల స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి.
  • ఈ 77 స్లాట్‌లలో 27 విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి.
  • అన్ని జట్ల మిగిలిన పర్స్ బ్యాలెన్స్ కలిపి మొత్తం 237 కోట్ల రూపాయలు. ఈ డబ్బు వేలంలో ఖర్చు చేయబడుతుంది.

జ‌ట్ల ప‌ర్స్ వివ‌రాలు

  • కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధికంగా 64.3 కోట్లు కలిగి ఉంది. వారు ఏకంగా 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.
  • ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (MI) వద్ద కేవలం 2.75 కోట్లు మాత్రమే మిగిలి ఉండగా, 5 స్లాట్‌లను నింపాల్సి ఉంది.
  • డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 16.4 కోట్లతో వేలంలో పాల్గొననుంది.

 

  Last Updated: 16 Nov 2025, 12:36 PM IST