Site icon HashtagU Telugu

Green Jersey: ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో ఎందుకు ఆడిందో తెలుసా?

Green Jersey

Green Jersey

Green Jersey: ఐపీఎల్ సీజన్ 18లో 28వ మ్యాచ్‌ రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు రాజస్థాన్‌పై ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జ‌ట్టు గ్రీన్ జెర్సీలో (Green Jersey) ఆడింది. ఈ ప్రత్యేక జెర్సీని జట్టు ఎందుకు ధరిస్తుంది? ఈ జెర్సీ వెన‌క ఆర్సీబీ ముఖ్య ఉద్దేశ్యం ఏంట‌నేది ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఆర్‌సీబీ గ్రీన్ జెర్సీ ఎందుకు ధరిస్తుంది?

గ్రీన్ జెర్సీ ఆర్‌సీబీ “గో గ్రీన్” చొరవలో భాగం. ఈ చొరవ కింద ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌లో గ్రీన్ కిట్ ధరించి ఆడటం ద్వారా పర్యావరణ స్థిరత్వం పట్ల తమ నిబద్ధతను చాటుతుంది. ఈ చొరవ లక్ష్యం పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం, ఎక్కువగా చెట్లు నాటడం, వ్యర్థాలను తగ్గించడం వంటివి ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ సోషల్ మీడియాలో సమాచారం ఇస్తూ ఇలా రాసింది. ఆర్‌సీబీ జెర్సీలు 95% వస్త్రం, పాలిస్టర్ వ్యర్థాల నుండి తయారు చేయబడ్డాయి. ప్యూమా రీఫైబర్ ఫాబ్రిక్ ద్వారా నాణ్యతను కోల్పోకుండా బహుసార్లు రీసైకిల్ చేయవచ్చు అని పేర్కొంది.

Also Read: Virat Kohli Heart Issue: విరాట్ కోహ్లీకి గుండె స‌మ‌స్య‌.. ఆందోళ‌న‌లో ఆర్సీబీ ఫ్యాన్స్, వీడియో వైర‌ల్‌!

గ్రీన్ జెర్సీలో ఆర్‌సీబీ రికార్డు

గ్రీన్ జెర్సీలో ఆర్‌సీబీ రికార్డు గ‌తంలో ఆక‌ట్టుకోలేదు. 2011 నుండి ఇప్పటివరకు జట్టు గ్రీన్ జెర్సీలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో కేవలం 5 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించగా, 9 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. అయితే ఈరోజు జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఈ సంఖ్య మారింది.

గ్రీన్ జెర్సీలో విరాట్ కోహ్లీ రికార్డు

ఆర్‌సీబీ రికార్డుకు భిన్నంగా విరాట్ కోహ్లీ ఈ గ్రీన్ జెర్సీలో అద్భుతంగా రాణించాడు. అతను ఈ ప్రత్యేక జెర్సీలో 14 మ్యాచ్‌లు ఆడాడు. 33.92 సగటు, 141.8 స్ట్రైక్ రేట్‌తో 441 పరుగులు సాధించాడు. ఈ జెర్సీలో కోహ్లీ 5 అర్ధసెంచరీలు, 1 సెంచరీని నమోదు చేశాడు. అతని వ్యక్తిగత ప్రదర్శన ఈ జెర్సీలో చాలా బలంగా ఉందని ఆర్ఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా రుజువైంది.