IPL 2025 Schedule: ఐపీఎల్ వేలం (IPL 2025 Schedule) పూర్తయి రెండు నెలలు దాటింది. ఈ ప్రీమియర్ లీగ్ ఆఫ్ క్రికెట్ ప్రారంభ తేదీ కూడా నిర్ణయించనట్లు మనకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని పూర్తి షెడ్యూల్ గురించి సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 21 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ఫైనల్ మే 25న జరగనుంది. ఒక నివేదిక ప్రకారం.. IPL 18వ సీజన్ మొత్తం షెడ్యూల్ క్యాలెండర్ వచ్చే వారం విడుదల కావచ్చు.
స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్రకారం.. రాబోయే ఏడు రోజుల్లో BCCI.. IPL 2025 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయగలదు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తమ రెండు హోమ్ మ్యాచ్‌లను తటస్థ వేదికలలో ఆడతాయి. ఢిల్లీకి ఈ వేదిక వైజాగ్ (ఆంధ్రప్రదేశ్) కాగా, రాజస్థాన్‌ల వెన్యూ మ్యాచ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. దీనితో పాటు మొదటి రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వవచ్చని కూడా నివేదికలో పేర్కొన్నాఆరు. దీంతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ రెండో ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
Also Read: Soldiers Killed: జమ్మూ కాశ్మీర్‌లో భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం నవంబర్‌లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. ఇందులో పది ఐపీఎల్ జట్లు రెండు రోజుల్లో రూ.639.15 కోట్లకు మొత్తం 182 మంది ఆటగాళ్లను తమ తమ జట్లలో చేర్చుకున్నాయి. భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతన్ని లక్నో సూపర్‌జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్‌గా చేసింది. భారత జట్టులో అతని సహచరుడు శ్రేయాస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు) రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడు. అయితే ఈ వేలంలో కొందరు పెద్ద స్టార్లు కూడా అమ్ముడుపోలేదు. వీరిలో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, విలియమ్సన్ వంటి చాలా మంది స్టార్ ప్లేయర్‌లను ఫ్రాంచైజీలు బిడ్ చేయలేదు.