Site icon HashtagU Telugu

RCB vs KKR: కేకేఆర్ కొంప‌ముంచిన వ‌ర్షం.. బెంగ‌ళూరు- కోల్‌క‌తా మ్యాచ్ ర‌ద్దు!

RCB vs KKR

RCB vs KKR

RCB vs KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ (RCB vs KKR) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులో నాన్ స్టాఫ్‌గా కురిసిన వర్షం వల్ల టాస్ కూడా జరగలేదు. ఈ మ్యాచ్ ముఖ్యంగా కేకేఆర్‌కు చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌ను గెలిచి మాత్రమే వారు ప్లేఆఫ్ రేసులో నిలిచి ఉండగలిగేవారు. మరోవైపు ఆర్‌సీబీ దాదాపుగా ప్లేఆఫ్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది.

సస్పెన్షన్ తర్వాత ఐపీఎల్ 2025లో ఇది మొదటి మ్యాచ్. కానీ చిన్నస్వామి స్టేడియంలో లైవ్ యాక్షన్‌ను చూడాలని అభిమానులు తహతహలాడారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చాలా మంది అభిమానులు తెల్ల జెర్సీలు ధరించి మైదానానికి వచ్చారు. కానీ వారు ఒక్క క్షణం కూడా విరాట్‌ను మైదానంలో చూడలేకపోయారు.

Also Read: Lokesh Meets Modi : మోడీ తో సమావేశమైన లోకేష్

కేకేఆర్‌కు వ‌ర్షం విలన్‌గా మారింది

వర్షం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు విలన్‌గా నిలిచింది. కేకేఆర్‌కు ఈ మ్యాచ్‌ను గెలవడం చాలా అవసరం. ఎందుకంటే ఆర్‌సీబీని ఓడించడం ద్వారా మాత్రమే కోల్‌క‌తా ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండేవి. ఇప్పుడు కేకేఆర్ 13 మ్యాచ్‌లలో ఐదు విజయాలతో 12 పాయింట్లను సాధించింది. ఇక వారికి ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే కేకేఆర్‌ 14 పాయింట్లకు చేరుకోవచ్చు.

ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్‌

కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ ల‌భించింఇ. దీంతో ఆర్‌సీబీ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో 17 పాయింట్లతో మొద‌టి స్థానానికి చేరుకుంది. అదే సమయంలో కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. కేకేఆర్ జట్టు ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది.