Site icon HashtagU Telugu

IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025.. ఏ జ‌ట్టుకు ఎంత ప్రైజ్‌మ‌నీ వ‌చ్చిందంటే?

IPL 2025 Prize Money

IPL 2025 Prize Money

IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠభరితమైన పోరాటం కనిపించింది. ఫైనల్‌లో పంజాబ్‌ను ఓడించి ఆర్‌సీబీ 17 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ టైటిల్ గెలవాలనే కల మరోసారి భగ్నమైంది. ఫైనల్‌లో ఓడినప్పటికీ పంజాబ్ కింగ్స్‌పై డబ్బుల వర్షం కురిసింది. ఐపీఎల్ 2025 టైటిల్ విన్న‌ర్‌, ర‌న్న‌ర‌ప్‌, క్వాలిఫ‌య‌ర్ జ‌ట్ల‌కు ఎంత ప్రైజ్ మ‌నీ (IPL 2025 Prize Money) ల‌భిస్తుందో ఇప్పుడు చూద్దాం.

పంజాబ్ కింగ్స్‌కు రూ. 12.5 కోట్లు లభించాయి

ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 ప‌రుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో పంజాబ్ మొదటిసారి ఛాంపియన్‌గా నిలవాలనే ఆశలు భ‌గ్న‌మ‌య్యాయి. ఇంతకుముందు 2014 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ అప్పుడు కూడా జట్టు ఓటమిని ఎదుర్కొంది. ఫైనల్‌లో ఓడిన తర్వాత పంజాబ్ కింగ్స్‌కు బహుమతిగా రూ. 12.5 కోట్లు లభించాయి.

Also Read: 8th Pay Commission: 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. భారీగా పెర‌గ‌నున్న జీతాలు?

ఆర్‌సీబీకి రూ. 20 కోట్లు లభించాయి

ఐపీఎల్‌కు ఇప్పుడు కొత్త ఛాంపియన్ లభించింది. ఆర్‌సీబీ 17 సంవత్సరాల ఎదురుచూపు ఇప్పుడు ముగిసింది. ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆర్‌సీబీ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి మొదటిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈసారి ఆర్‌సీబీ రజత్ పాటిదార్‌ను జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. అతను ఆర్‌సీబీని మొదటిసారి ఛాంపియన్‌గా నిలిపాడు. ఛాంపియన్‌గా నిలిచిన ఆర్‌సీబీకి రూ. 20 కోట్ల బహుమతి లభించింది. 2022 తర్వాత బీసీసీఐ ప్రైజ్‌మ‌నీలో ఎలాంటి మార్పు చేయలేదని తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌కు కూడా బహుమతి

విజేత, రన్నరప్‌తో పాటు ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్లకు కూడా ప్రైజ్‌మ‌నీ ప్ర‌క‌టించారు. ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2 వరకు చేరుకోగలిగింది. కానీ పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయి హార్దిక్ పాండ్యా జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు రూ. 7 కోట్ల ప్రైజ్‌మ‌నీ లభించింది. అంతేకాకుండా గుజరాత్ టైటాన్స్ జట్టు ఎలిమినేటర్ వరకు చేరుకుంది. దీంతో శుభ్‌మన్ గిల్ జట్టుకు రూ. 6.3 కోట్లు లభించాయి.