Site icon HashtagU Telugu

PBKS vs RR: మైదానంలో లైవ్ మ్యాచ్ జరుగుతోంది.. హాయిగా నిద్ర‌పోయిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైర‌ల్

Jofra Archer

Jofra Archer

PBKS vs RR: ఐపీఎల్‌ 2025లో భాగంగా శ‌నివారం రాత్రి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్ల‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు విజ‌యం సాధించింది. తొలుత ఆర్ఆర్ జ‌ట్టు బ్యాటింగ్ చేసి 205 పరుగులు చేసింది. య‌శ‌స్వీ జైస్వాల్ (45 బంతుల్లో 67 ప‌రుగులు), సంజు శాంస‌న్ (26బంతుల్లో 38), రియాన్ ప‌రాగ్ (25 బంతుల్లో 43) ప‌రుగుల‌తో రాణించారు. ఆ త‌రువాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జ‌ట్టు టార్గెట్ ను ఛేదించ‌డంలో విఫ‌ల‌మైంది. అయితే, ఈ మ్యాచ్ లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Also Read: KL Rahul: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీని అధిగ‌మించిన కేఎల్ రాహుల్‌!

సాధారణంగా, బ్యాటింగ్ జట్టు ఆటగాళ్ళు తమ ప్యాడ్లతో సిద్ధంగా కూర్చుంటారు. పంజాబ్ జ‌ట్టుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ నిద్రపోతూ కనిపించాడు. ఆర్చర్ డ్రెస్సింగ్ రూమ్‌లో దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాస్ట్ బౌల‌ర్‌ జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ కు చివ‌రిలో వ‌స్తాడు. రాజ‌స్థాన్ జ‌ట్టు ఈ మ్యాచ్ లో పెద్ద‌గా వికెట్లు కోల్పోలేదు. కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 205 ప‌రుగులు చేసింది. దీంతో తాను బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని భావించిన ఆర్చ‌ర్ హాయిగా డ్రెస్సింగ్ రూంలో ఓ కునుకు తీయ‌డం క‌నిపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజస్థాన్ ఇన్నింగ్స్ సగం ముగిసిన తర్వాత కూడా జోఫ్రా ఆర్చర్ ఇంకా నిద్రపోతున్నాడు. కానీ, కొన్ని నిమిషాల తర్వాత, అతను హెల్మెట్, ప్యాడ్లతో సహా బ్యాటింగ్ కోసం పూర్తి గెటప్‌లో కనిపించాడు. ఓ నెటిజ‌న్‌ మాట్లాడుతూ.. ఇక్కడ లాకీ ఫెర్గూసన్ జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడని, అక్కడ ఆర్చర్ నిద్రపోతున్నాడని చెప్పాడు.

ఇదిలాఉంటే.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అద‌ర‌గొట్టాడు. తొలి ఓవ‌ర్ లోనే రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి రాజ‌స్థాన్ గెలుపులో కీల‌క భూమిక పోషించారు. తొలి బంతికే ప్రియాంష్ ఆర్యను అద్భుత బౌలింగ్ తో అర్చ‌ర్ క్లీన్ బౌల్డ్ చేశారు. దీంతో ప్రియాంష్ డ‌కౌట్ రూపంలో పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాల్సి వ‌చ్చింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (10)ను తొలి ఓవ‌ర్లోనే ఆర్చ‌ర్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవ‌ర్లు వేసి జోప్రా ఆర్చ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి రాజ‌స్థాన్ విజ‌యంలో కీల‌క భూమిక పోషించాడు.