Site icon HashtagU Telugu

IPL 2025: ఢిల్లీని వెంటాడుతున్న ఓపెనర్ల ఫామ్…

Delhi Capitals

Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది. కానీ ఆ జట్టు బ్యాటింగ్ దళం దారుణంగా విఫలమైంది. చివర్లో అశుతోష్ శర్మ మరియు విప్రజ్ నిగమ్ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను వికెట్ తేడాతో ఓడించగలిగింది. నిజానికి ఢిల్లీ ఓపెనర్లు అద్భుతాలు చేస్తారని అంతా భావించారు. కానీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు తొలి మ్యాచ్‌లోనే విఫలమవ్వడంతో ఆ జట్టు గెలిచినా, ఓడినట్టేనని కొందరు భావిస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ఓపెనర్లుగా అడుగుపెట్టారు. ఫ్రేజర్ మెక్‌గుర్క్ మొదటి ఓవర్ మూడవ బంతికి అవుటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ అతనికి పెవిలియన్‌కు మార్గం చూపించాడు. ఫ్రేజర్ మెక్‌గుర్క్ కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియాకు చెందిన జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను రూ. 9 కోట్లకు నిలుపుకుంది. అటు ఫాఫ్ డు ప్లెసిస్ కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఫాఫ్ డు ప్లెసిస్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఓపెనింగ్ చేశాడు. ఓపెనర్‌గా ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఓపెనింగ్ బాధ్యతను సరిగ్గా రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో డు ప్లెసిస్ 18 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఓపెనర్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.