Site icon HashtagU Telugu

MS Dhoni: న‌యా లుక్‌లో ఎంఎస్ ధోనీ.. హీరో లెవెల్ ఎంట్రీ, వీడియో వైర‌ల్‌

MS Dhoni

MS Dhoni

MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 43 ఏళ్ల వయసులో కూడా కొత్త సీజన్ కోసం పూర్తిగా సిద్ధమయ్యాడు. ధోనీని మళ్లీ మైదానంలో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. 5 సార్లు IPL ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు కొత్త సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. దీని కోసం సూపర్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా చెన్నై చేరుకున్నాడు.

మహేంద్ర సింగ్ ధోని కొత్త స్టైల్‌లో క‌నిపించాడు

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ మరింత పెరిగింది. ఈ స్టార్ ప్లేయర్‌ను చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ IPL 2025 కోసం సిద్ధం కావడానికి చెన్నై చేరుకున్నాడు. ధోనీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహి ఈ కొత్త స్టైల్‌ని అభిమానులు నిజంగా ఇష్టపడుతున్నారు. ఫిబ్రవరి 25 నుంచి CSK ఆటగాళ్లు చెన్నై చేరుకుంటున్నారు. కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ కూడా చెన్నైలోనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ త్వరలో జట్టుతో కలిసి మైదానంలో కనిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: No Income Tax: రూ. 17 లక్షల జీతం కూడా పన్ను రహితమే.. మీరు చేయాల్సింది ఇదే!

ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడబోతున్నాడు

కెప్టెన్‌గా 5 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2025లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. మెగా వేలానికి ముందు ధోనిని CSK జట్టు కేవలం 4 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. గత 2 నుండి 3 సీజన్లలో ధోని చివరి 2 నుండి 3 ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కొత్త సీజన్‌లో మహీని బ్యాటింగ్‌కు ముందుగానే వ‌స్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అయితే ధోనీ ఈ సీజ‌న్ త‌ర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.