SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు IPL 2024 నుంచి భిన్నమైన శైలిలో కనిపించింది. జట్టు బలం ఇప్పుడు దాని బ్యాటింగ్ ఆర్డర్‌తో అంచనా వేస్తారు. ఈ జట్టు IPL చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా కూడా గుర్తింపు పొందింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ (SRH vs KKR) ఆర్‌సీబీపై IPLలో అత్యధిక స్కోరు 287 పరుగులు చేసింది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఈసారి ఈ జట్టు 300 పరుగుల మైలురాయిని కూడా అందుకోవచ్చని అనిపించింది. దీనిని కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఆశించారు.
సీజన్-18 మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 300 పరుగుల మైలురాయిని తాకగలదని బలంగా అనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఈ మ్యాచ్ తర్వాత నుంచి పాట్ కమిన్స్ జట్టు నీరసంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌లలో ఈ జట్టు ఇప్పటివరకు కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. వరుసగా 3 మ్యాచ్‌లలో హైదరాబాద్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కేకేఆర్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో కావ్య మారన్ జట్టును ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్
300 పరుగులు చేస్తామని కలలు కన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. బలమైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో చాలా దారుణమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ కూడా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 300 పరుగులు ఏమో కానీ కనీసం ప్రత్యర్థి జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని అయిన చేధించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Vijay Devarakonda: బాలీవుడ్‌పై హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
నిరాశపరిచిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు
నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ల ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దారుణంగా విఫలమైంది. మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 4 పరుగులు, అభిషేక్ శర్మ 2 పరుగులు, ఇషాన్ కిషన్ 2 పరుగులు, అనికేత్ వర్మ 6 పరుగులు చేసి ఔటయ్యారు. సన్‌రైజర్స్ తరపున హెన్రిక్ క్లాసెన్ అత్యధికంగా 33 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా కమిందు మెండిస్ 27 పరుగులు చేశాడు.