Site icon HashtagU Telugu

KKR vs RCB: బెంగళూరు అరాచకం.. ఐపీఎల్‌ను విజయంతో మొదలుపెట్టిన ఆర్సీబీ!

KKR vs RCB

KKR vs RCB

KKR vs RCB: ఐపీఎల్‌ 2025 సీజన్-18 ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కొత్త కెప్టెన్‌తో ఇరు జట్లు ఆడుతున్నాయి. ఆర్‌సీబీకి రజత్ పాటిదార్, కేకేఆర్‌కు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రారంభించింది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో RCB 7 వికెట్ల తేడాతో KKRని ఓడించింది. 175 పరుగుల స్కోరును ఛేదించిన ఆర్సీబీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. ఆర్‌సీబీ తరఫున ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేయగా, కోహ్లీ 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

IPL 2025 మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. దీనిలో RCB గెలిచింది. ఐపీఎల్ 18వ సీజన్‌ను ఆర్‌సీబీ విజయంతో ప్రారంభించింది. అంతకుముందు 2008 IPLలో KKR- RCB మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో KKR విజయాన్ని నమోదు చేసింది. అయితే 18 ఏళ్ల తర్వాత RCB తన ప్రతీకారం తీర్చుకుంది. కేకేఆర్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ లీగ్‌ను విజయంతో ఆరంభించింది.

RCB 175 పరుగుల లక్ష్యాన్ని సాధించింది

RCBకి KKR 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే బెంగళూరు కేవలం 16.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు తరఫున విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సాల్ట్, విరాట్ మధ్య 95 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా ఉంది.

ఇది కాకుండా కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 5 బంతుల్లో 15 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 10 పరుగులు చేశాడు. సాల్ట్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ తరఫున కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు హేజిల్‌వుడ్ 2, సుయాష్, దయాల్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ తరఫున వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ తలో వికెట్ తీశారు.

Also Read: Kohli Bowling: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో మొద‌టి ఓవర్ వేసిన విరాట్ కోహ్లీ! షాక్ అయ్యారా?

తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. జట్టు తరుపున కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. దీంతో పాటు సునీల్ నరైన్ 44 పరుగులు, రఘువంశీ 30 పరుగులు చేశారు. వెంకటేష్ అయ్యర్ 6, క్వింటన్ డి కాక్ 4, రింకు సింగ్ 12, ఆండ్రీ రస్సెల్ 4, రమణదీప్ సింగ్ 6, హర్షిత్ రాణా 5, స్పెన్సర్ జాన్సన్ 1 పరుగు చేశాడు.