IPL 2025 Prize Money: ఐపీఎల్‌లో ఈ రోజు ట్రోఫీ కోసం ఆర్‌సీబీ- పంజాబ్ మధ్య నేరుగా జరిగే పోటీ జరగనుంది. అయితే పోటీకి ముందు ఐపీఎల్ గెలిచే జట్టు ఎంత డబ్బు పొందుతుందని అందరూ ఆలోచిస్తున్నారు. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయే జట్టు (రన్నరప్)కు ఎంత డబ్బు (IPL 2025 Prize Money) వస్తుందనే సందేహలు నెలకొన్నాయి. అయితే విజేత, రన్నరప్‌లతో పాటు పర్పల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ విజేతలకు ఎన్ని లక్షలు వస్తాయో కూడా ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం!
ఐపీఎల్ గెలిచిన జట్టుకు ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయి?
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా 20 కోట్ల రూపాయలు వస్తాయి. అదే సమయంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు లభిస్తాయి.
పర్పల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ విజేతలకు ఎంత డబ్బు వస్తుంది?
సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ లభిస్తుంది. అంతేకాకుండా 10 లక్షల రూపాయలు కూడా ఇస్తారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పల్ క్యాప్‌తో సత్కరిస్తారు. ఆ బౌలర్‌కు కూడా 10 లక్షల రూపాయలు లభిస్తాయి.
ఏ ఆటగాడికి ఎంత డబ్బు వస్తుందో ఇక్కడ తెలుసుకోండి
- ఆరెంజ్ క్యాప్: 10 లక్షల రూపాయలు
- పర్పల్ క్యాప్: 10 లక్షల రూపాయలు
- ఇమెర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: 20 లక్షల రూపాయలు
- మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: 10 లక్షల రూపాయలు
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: 10 లక్షల రూపాయలు
- పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: 10 లక్షల రూపాయలు
- సీజన్‌లో అత్యధిక సిక్సర్లు: 10 లక్షల రూపాయలు
- గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్: 10 లక్షల రూపాయలు