మెగా వేలం(Mega Auction) కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జెడ్డాలో మెగా వేలం జరగనుంది. 1574 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. స్టార్ ప్లేయర్లు వేలంలోకి రావడంతో ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడే అవకాశముంది. ధనాధన్ బ్యాటింగ్ తో అలరించే ఆటగాళ్లను మాత్రమే కాకుండా అత్యుత్తమ ఫీల్డింగ్ తో మ్యాచ్ లను గెలిపించే ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తున్నాయి. క్యాచేస్ విన్స్ మ్యాచెస్ అని ఊరికే అనలేదు. మైదానంలో ఫీల్డర్ల పాత్ర జట్టు విజయంలో కచ్చితంగా ఉంటుంది. ఐపీఎల్‌లో అత్యుత్తమ ఫీల్డర్ గురించి మాట్లాడాలంటే కచ్చితంగా కోహ్లీని గుర్తు చేసుకోవాలి. మైదానంలో చిరుతపులిలా పరుగెడుతూ పాదరసంలా మెలితిరుగుతూ బంతుల్ని ఒడిసిపట్టుకుంటాడు.
కోహ్లి ఐపీఎల్‌లో 252 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను అత్యధికంగా 114 క్యాచ్‌లు పట్టాడు. ఒక మ్యాచ్‌లో 3 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. 100కి పైగా క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో మొత్తం 5 మంది ఉన్నారు. విరాట్ తర్వాత 205 మ్యాచుల్లో 109 క్యాచ్‌లు పట్టిన సురేశ్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు.103 క్యాచ్‌లు అందుకున్న కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. రవీంద్ర జడేజా 103 క్యాచ్‌లు పట్టాడు. 257 మ్యాచ్‌ల్లో 101 క్యాచ్‌లు పట్టిన రోహిత్ శర్మ 5వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఒక మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు పట్టిన ఏకైక ఆటగాడు రవీంద్ర జడేజా మాత్రమే. ఐపీఎల్‍లో 1000 పరుగులు, 100 క్యాచ్‍లు, 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ అంటే రవీంద్ర జడేజా పేరునే చెప్పాలి.
Read Also : Axar Patel: అక్షర్ పటేల్ కు ఢిల్లీ పగ్గాలు.. ఇవాళ క్లారిటీ!