Site icon HashtagU Telugu

DC vs SRH: విశాఖ వేదిక మ‌రో హైవోల్టేజీ మ్యాచ్‌.. టాస్ బ్యాటింగ్ చేయ‌నున్న స‌న్‌రైజ‌ర్స్, తుది జ‌ట్లు ఇవే!

DC vs SRH

DC vs SRH

DC vs SRH: ఐపీఎల్ 2025 పదవ మ్యాచ్‌లో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC vs SRH) తలపడనుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్: జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నీతీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), జీషాన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.

పాయింట్ల ప‌ట్టిక (మ్యాచ్ మొదలయ్యే ముందు)

Also Read: Shocking Incident : పుతిన్‌పై హత్యాయత్నం ? కారులో పేలుడు.. జెలెన్‌ స్కీ జోస్యం నిజమేనా ?

ఐపీఎల్ 2025 సీజన్‌లో 10వ మ్యాచ్ కంటే ముందు వరకు ఇరు జట్ల‌ మధ్య హెడ్-టు-హెడ్ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.

2023 నుంచి జరిగిన చివరి 3 మ్యాచ్‌లలో SRH 2 సార్లు గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌లన్నీ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అయితే గత 5 ఎన్‌కౌంటర్లలో ఢిల్లీ 4 సార్లు గెలిచి ఆధిపత్యం చూపింది. కానీ గ‌తేడాది జ‌రిగిన మ్యాచ్‌లో SRH విజయం సాధించింది (2024 సీజన్‌లో)

ఈ హెడ్-టు-హెడ్ రికార్డ్ SRHకి స్వల్ప ఆధిక్యతను చూపిస్తుంది. కానీ ఇటీవలి ఫామ్, ప్రస్తుత సీజన్ ప్రారంభ విజయాలు రెండు జట్లకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం వారి హెడ్-టు-హెడ్ గణాంకాలను మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు.