ఐపీల్ 2025 ముగిసింది. బెంగళూరు జట్టు చివరికి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఐపీఎల్ 2025 ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో పంజాబ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ (IPL 2025) అభిమానులకు ఉత్సాహాన్ని, థ్రిల్‌ను పంచిన అరుదైన సీజన్‌గా నిలిచింది. ఈ సీజన్ మొత్తం అత్యుత్తమ ప్రదర్శనలతో అభిమానుల హృదయాలను గెలిచిన పలువురు ఆటగాళ్లు (The players) ప్రత్యేక అవార్డులను అందుకున్నారు. ముఖ్యంగా మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ గెలుచుకోవడం విశేషం. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన సాయి సుదర్శన్ ఈసారి ఆరెంజ్ క్యాప్‌తో పాటు, “ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్” అవార్డును కూడా దక్కించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.
Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!
బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ కృష్ణ జిగేల్‌గానే చెలరేగి 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. అతడి లైన్స్, లెంగ్త్స్ లో స్పష్టత ఉండటంతో ప్రత్యర్థులు దెబ్బతిన్నారు. క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును కమిందు మెండిస్ అందుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకున్న అద్భుత ఫీల్డింగ్‌కు నిదర్శనంగా నిలిచింది. ఇక స్పోర్ట్స్‌మన్‌షిప్ పరంగా అత్యధిక పాయింట్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిర్ ప్లే అవార్డును గెలుచుకుంది.
ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఆటగాళ్ల మధ్య పోటీలో సూర్య వంశీ ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’గా నిలవడం గర్వకారణం. సాయిసుదర్శన్ మరో విభాగమైన “4s ఆఫ్ ది సీజన్” కూడా గెలుచుకుని ఈసారి సంపూర్ణ సీజన్ ఆటగాడిగా రాణించాడు. మొత్తం మీద ఐపీఎల్ 2025 టాలెంట్‌కు, కష్టపడే ఆటగాళ్లకు సరైన గుర్తింపు ఇచ్చిన సీజన్‌గా నిలిచింది. అభిమానుల ఆసక్తిని మిన్ను మిస్తూ ముగిసిన ఈ సీజన్ కొత్త ఆశలతో వచ్చే ఏడాదికి దారి చూపించింది.