Site icon HashtagU Telugu

IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభమయ్యేది ఎప్పుడో తెలుసా..?

Predicted All IPL Teams

Ipl Points Table

IPL 2024: వరల్డ్ క్రికెట్ లోని స్టార్ ప్లేయర్స్ అందరూ సందడి చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 16 సీజన్లుగా క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇటు బీసీసీఐకి, అటు ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా 17వ సీజన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. దుబాయ్ వేదికగా మినీ వేలం జరగనున్న వేళ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ షెడ్యూల్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. మే చివరి నాటికి ఈ సీజన్‍ను ముగించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

బోర్డు వర్గాల సమాచారం ప్రకారం దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‍ను ఎన్నికల కమిషన్ ప్రకటించాక.. ఐపీఎల్ సీజన్‍కు తేదీలను బీసీసీఐ ఖరారు చేయనుంది. అయితే ఇప్పటి వరకూ తెలిసిన వివరాల ప్రకారం మార్చి 22న 17వ సీజన్ ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఫ్రాంచైజీలకు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో సెక్యూరిటీ ఏర్పాట్లకు సమస్య లేకుండా బీసీసీఐ వేచిచూస్తోంది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాతే పూర్తి స్థాయి షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలున్నాయి.

Also Read: Speaker Volume: మీ ఫోన్ స్పీకర్ వ్యాల్యూమ్ తగ్గిపోయిందా.. సర్వీస్ సెంటర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే సరి చేసుకోండిలా?

ఇదిలా ఉంటే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఆటగాళ్లందరూ వచ్చే ఏడాది ఐపీఎల్ పూర్తి సీజన్‍కు అందుబాటులో ఉండనున్నారు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొత్తం సీజన్‍కు అందుబాటులో ఉంటారో లేదో తెలియాల్సి ఉంది. ఆయా దేశాల క్రికెట్ బోర్డుల అనుమతిపై ఇది ఆధారపడి ఉంది. వేలానికి ముందే ఫ్రాంచైజీలు దీనిపై బోర్డుతో చర్చించినట్టు తెలుస్తోంది. తీరా వేలంలో కోట్లు పెట్టి కొన్న తర్వాత ఆయా దేశాల ఆటగాళ్ళు అందుబాటులో లేని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలం ముగిసిన కొద్ది రోజులకే దీనిపై క్లారిటీ రానుంది. అప్పుడే రీప్లేస్ మెంట్స్ పై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టనున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.