IPL 2024: విరాట్ vs శశాంక్ సింగ్

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో తిరుగులేని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. గతేడాదితో భీకర ఫామ్ మైంటైన్ చేసిన విరాట్ ఈ ఏడాదిలోనూ అదే స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విరాట్ 4 హాఫ్ సెంచరీలు చేశాడు

IPL 2024: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో తిరుగులేని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. గతేడాదితో భీకర ఫామ్ మైంటైన్ చేసిన విరాట్ ఈ ఏడాదిలోనూ అదే స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విరాట్ 4 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే స్ట్రైక్ రేట్ పరంగా కోహ్లీ కాస్త వెనుకబడి ఉన్నాడు. మరోవైపు యంగ్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ లాంటి ఆటగాళ్లు అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు. అయితే ఈ ఆటగాళ్లను కోహ్లీతో పోల్చడం కరెక్ట్ కాదు.

కోహ్లీ కన్సిస్టెన్సీగా ఆడతాడు. 50 ఓవర్ల పాటు క్రీజులో నిల్చోగలడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరనేది అవసరం ఉండదు. తన క్లాస్ ఆటతీరుతో చక్కని బౌండరీలు బాదుతాడు. తన అవసరం ఉందనిపిస్తే చెలరేగిపోతాడు. అనవసర షాట్ల జోలికి వెళ్ళడు. ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తాడు. మిగతా ఆటగాళ్లు ఒక్కరు పెవిలియన్ చేరుతున్నా.. కోహ్లీ అదరడు, బెదరడు. కానీ ఐపీఎల్ లో కొత్తగా ఆడుతుపెట్టిన పంజాబ్ జట్టు కుర్రాడు శశాంక్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తనని కేవలం 20 లక్షలు కొనుగోలు చేస్తే.. శశాంక్ మాత్రం 20 కోట్ల ఆట ఆడుతున్నాడు. అవమానం జరిగిన చోటే గెలుపు ఆనందాన్ని వెతుక్కుంటూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. అనవసరంగా కొన్నారు అన్న వాళ్ళ నోర్లను మూయిస్తూ నెక్స్ట్ ఐపీఎల్ కుబెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. చివర్లో వచ్చి విస్ఫోటనంలా ఎగసిపడుతూ జట్టును విజయతీరాలకు చేరుస్తున్నాడు.

We’re now on WhatsApp : Click to Join

త్వరలో శశాంక్ ని ఇండియన్ టీంలో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అంటే శశాంక్ ఏ పాటి విధ్వంసానికి తెగబడుతున్నాడో అర్ధం చేసుకున్నాడు. కోల్​కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 28 బంతుల్లోనే 68 పరుగులతో పంజాబ్​కు సంచలన విజయాన్ని అందించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శశాంక్ సునామీని మరో ఐపీఎల్ వరకు గుర్తుపెట్టుకునేలా అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. శశాంక్ సింగ్ ఈ సీజన్​లో ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచుల్లో కలిపి 182.6 స్ట్రయిక్ రేట్​తో 263 పరుగులు చేశాడు. 2 ఫిఫ్టీలు బాదాడు. 19 ఫోర్లతో పాటు 18 భారీ సిక్సులు తన అకౌంట్ లో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్ తర్వాత టి20 ప్రపంచకప్ జరగనుంది. యూఎస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్-జూన్ 2వ తేదీ నుంచి మొదలవనుంది. ఈ తరుణంలో శశాంక్​ను జట్టులోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Also Read: UP University: ఆన్స‌ర్ షీట్‌లో జై శ్రీరామ్, విరాట్ కోహ్లీ పేర్లు.. న‌లుగురు విద్యార్థులు పాస్‌..!