IPL New Rule: IPL 2024 కోసం వేలం ఈ రోజు అంటే డిసెంబర్ 19న దుబాయ్‌లో నిర్వహించబడుతోంది. అయితే దానికి ముందు ఒక న్యూస్ బయటకు వచ్చింది. తాజా నివేదిక ప్రకారం.. IPL ఈ సీజన్‌లో కొన్ని నియమాలు (IPL New Rule) మార్చనున్నట్లు తెలుస్తోంది. కొన్ని కొత్త నిబంధనలు యాడ్ చేయనున్నారు. గత ఐపీఎల్‌కు ముందు కూడా ఇంపాక్ట్ ప్లేయర్, నో బాల్, వైడ్ బాల్‌ను రివ్యూ చేసే నియమాన్ని ప్రవేశపెట్టిన విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిందే.
ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లు
ESPNcricinfo యొక్క నివేదిక ప్రకారం.. IPL తదుపరి సీజన్ అంటే IPL 2024 నుండి బౌలర్లు IPL మ్యాచ్‌లలో ప్రతి ఓవర్‌లో గరిష్టంగా 2 బౌన్సర్‌లను వేయవచ్చు. ఇలాంటి రూల్ ఐపీఎల్ లో ఇప్పటివరకు లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న నిబంధనలనే ఐపిఎల్‌లో అనుసరించారు. అయితే ఈ కొత్త రూల్ వలన బౌలర్లు ఒక ఓవర్‌లో గరిష్టంగా 2 బౌన్సర్‌స్ వేయవచ్చు. అంతకముందు ఒక బౌన్సర్ కంటే ఎక్కువ బౌలింగ్ చేస్తే నో బాల్‌గా పరిగణించేవారు. అయితే ఈ కొత్త నిబంధనకు సంబంధించి బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన రాలేదు.
ఐపీఎల్‌లో ఏటా కొన్ని కొత్త నిబంధనలు చేరుస్తూనే ఉన్నారు. గతేడాది ఐపీఎల్ మ్యాచ్‌లపై ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ప్రభావం ఎక్కువగానే పడింది. ఈ నిబంధనను కొందరు ఇష్టపడగా, మరికొందరు వ్యతిరేకించారు. అదే సమయంలో వైడ్, నో బాల్ విషయంలో కూడా బ్యాట్స్‌మన్‌కు ఏదైనా సందేహం ఉంటే దానిని అతను స్వయంగా పరిష్కరించుకునేలా రివ్యూ చేసే హక్కు ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐపీఎల్ వేలంలో 77 మంది ఆటగాళ్లకే ఛాన్స్
IPL 2024 కోసం వేలం ఈరోజు అంటే డిసెంబర్ 19న నిర్వహించబడుతుంది. మొత్తం 10 జట్లు వేలానికి సిద్ధమయ్యాయి. ఈసారి వేలంలో 333 మంది ఆటగాళ్ల పేర్లు కనిపించనుండగా, వారిలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఈ వేలంలో ఆటగాళ్లకు 77 స్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో విదేశీ ఆటగాళ్లకు 30 స్లాట్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 77 మంది ఆటగాళ్లలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.