IPL 2024: 100 కోట్లతో ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్సు వాల్యూ

ఐపీఎల్ 17th సీజన్ వేలం డిసెంబ‌ర్ 19న దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ దగ్గర అత్య‌ధికంగా 12.20కోట్లు ఉంటె ముంబై వ‌ద్ద కేవలం 50ల‌క్ష‌లు మాత్రమే ఉన్నాయి.

IPL 2024:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫ్రాంచైజీల పర్స్‌ వాల్యూను పెంచుతున్నట్టు తెలుస్తున్నది. ఐపీఎల్ 17వ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించిన బీసీసీఐ.. వచ్చే ఏడాదికి సంబంధించిన లీగ్ కోసం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా వేలం నిర్వహించనుంది.

ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ దగ్గర అత్య‌ధికంగా 12.20కోట్లు ఉంటె ముంబై వ‌ద్ద కేవలం 50ల‌క్ష‌లు మాత్రమే ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 6.55 కోట్లు, గుజరాత్ టైటాన్స్ చేతుల్లో 4.45 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 4.45 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర 3.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ దగ్గర 3.35 కోట్లు ఉన్నాయి. కింగ్ కోహ్లీ సారధ్యం వహిస్తున్న ఆర్సీబీ వద్ద కేవలం 1.75 కోట్లు మాత్రమే ఉండగా కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద 1.65 కోట్లు ఉన్నాయి. ఇక ధోని సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో కూడా 1.5 కోట్లు ఉన్నాయి. అయితే ఈ సారి వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీ ప‌ర్స్ విలువ 5 కోట్లకు పెరుగుతుంది. గ‌త సీజ‌న్‌లో ప్రాంఛైజీల ప‌ర్స్ వాల్యూ 95 కోట్లుగా ఉండేది. ఇప్పుడు 5 కోట్లు పెరుగుతుంది కాబట్టి దాని విలువ 100 కోట్ల‌కు చేరుతుంది.

Also Read: world cup 2023: పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ..జట్టు డిస్ట్రబ్ అవుతుందా?