Shamar Joseph: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విండీస్‌ డైనమిక్ బౌలర్..!

గత నెలలో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ త‌ర‌పున‌ 7 వికెట్లు తీసి చారిత్రాత్మక విజయాన్ని అందించిన షామర్ జోసెఫ్ (Shamar Joseph) ఐపీఎల్‌(IPL 2024)లోకి ప్రవేశించాడు.

  • Written By:
  • Updated On - February 10, 2024 / 11:10 PM IST

Shamar Joseph: గత నెలలో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ త‌ర‌పున‌ 7 వికెట్లు తీసి చారిత్రాత్మక విజయాన్ని అందించిన షామర్ జోసెఫ్ (Shamar Joseph) ఐపీఎల్‌(IPL 2024)లోకి ప్రవేశించాడు. ఈ విండీస్ ఆట‌గాడిని 3 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి)తో కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో జోసెఫ్ లక్నో జట్టులోకి రానున్నాడు. ఈ మేరకు వార్త క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

తొలి బంతికే స్మిత్‌ వికెట్ తీశాడు

24 ఏళ్ల జోసెఫ్ గత నెలలో అడిలైడ్‌లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన స్టీవ్ స్మిత్ వికెట్‌ను కెరీర్‌లో తొలి బంతికే తీశాడు. దీని తర్వాత బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో జోసెఫ్ తన ఆకర్షణీయ ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ త‌న బౌలింగ్‌తో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌కు 8 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందించాడు. 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో కరీబియన్ జట్టుకు ఇదే తొలి టెస్టు విజయం. జోసెఫ్ ప్రదర్శన ఆధారంగా వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Also Read: YSRCP Manifesto 2024: ఫిబ్రవరి 18న సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఐపీఎల్ 2022 కోసం నిర్వహించిన వేలంలో మార్క్ వుడ్‌ను రూ.7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. అయితే వుడ్ మోచేయి గాయం కారణంగా ఆ సీజన్‌లో ఆడలేదు. అతను IPL 2023లో పునరాగమనం చేసాడు. 4 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 11.82 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. వుడ్ పనిభార నిర్వహణ కోసం ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అతనిని IPL 2024 నుండి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వుడ్.. ECB సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్. రానున్న రోజుల్లో ఇంగ్లండ్‌కు ఈ ఫాస్ట్ బౌలర్ చాలా అవసరమ‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకుంది ఈసీబీ.

We’re now on WhatsApp : Click to Join

IPL 2024 కోసం లక్నో జట్టు

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మహ్మద్ అర్షద్ ఖాన్.