IPL 2024: ఐపీఎల్ నుంచి మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఔట్

ఐపీఎల్ ప్రారంభానికి ముందు, చాలా మంది టీమిండియా ఆటగాళ్లు గాయాల బారీన పడ్డారు. దీంతో ఫ్రాంచైజీలు టెన్షన్‌ పడుతున్నాయి. ఈ క్రమంలో రిషబ్ పంత్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
IPL 2024

IPL 2024

IPL 2024: ఇటీవలే రోహిత్ శర్మ సారథ్యంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 4-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు రోహిత్‌తో సహా ఆటగాళ్లందరూ మార్చి 22 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నారు.అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు, చాలా మంది టీమిండియా ఆటగాళ్లు గాయాల బారీన పడ్డారు. దీంతో ఫ్రాంచైజీలు టెన్షన్‌ పడుతున్నాయి. ఈ క్రమంలో రిషబ్ పంత్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది.

1. రిషబ్ పంత్:
2022 డిసెంబర్ 30న, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం తర్వాత అతనికి ఆపరేషన్ కూడా జరిగింది. దీని తరువాత 14 నెలల పాటు క్రికెట్ కి దూరమయ్యాడు. పంత్ ఐపీఎల్ 2024లో ఆడటంపై బీసీసీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. పంత్ బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ లో పంత్ ఆడటం ఖరారైంది.

2. ప్రసిద్ధ్ కృష్ణ::
ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ గురించి బీసీసీఐ బ్యాడ్ న్యూస్ తెలిపింది. ప్రసిద్ధ్ కృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఎడమ క్వాడ్రిస్ప్స్ స్నాయువుకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది. అతను త్వరలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాస ప్రక్రియను ప్రారంభించనున్నాడు. అటువంటి పరిస్థితిలో ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ ఆడలేడని బీసీసీఐ కన్ఫర్మ్ చేసింది.

3. మహ్మద్ షమీ:
ప్ప్రపంచకప్ లో షమీ గాయపడ్డాడు. దీంతో షమీకి ఫిబ్రవరి 26న శస్త్రచికిత్స జరిగిందని, అతను కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం షమీ వైద్య బృందం పరిశీలనలో ఉన్నాడు. అయితే అతను ఈ సీజన్ ఐపీఎల్ ఆడటం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో షమీ ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ లో విధ్వంసం సృష్టించిన షమీ ఆ తర్వాత మరే సిరీస్ లోనూ ఆడలేద. అయితే ఐపీఎల్ లోనైనా ఆడతాడని ఆశపడ్డ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.

Also Read: Kadana Bheri : కరీంనగర్ సభకు కేటీఆర్ దూరం..కారణం అదే..!!

  Last Updated: 12 Mar 2024, 01:56 PM IST